గ్రామంలో వరుసగా మరణిస్తున్న కోతులు.. ఆందోళనలో గ్రామస్తులు
మారెడ్డి జిల్లా ముత్యంపేటలో గత 15 రోజులుగా కోతుల మరణాలు తీవ్ర కలకలం సృష్టించాయి. విష ప్రయోగం కారణంగా సుమారు 50 కోతులు ప్రాణాలు కోల్పోవడం జంతు ప్రేమికులను, గ్రామస్తులను కలచివేసింది. మామిడి తోటలో పంట నష్టం నివారణకు ఈ ఘాతుకం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అధికారులు దర్యాప్తు ప్రారంభించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
మారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో గత 15 రోజులుగా జరుగుతున్న కోతుల మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన విష ప్రయోగం వల్ల సుమారు 50 కోతులు ప్రాణాలు కోల్పోవడం జంతు ప్రేమికులను, గ్రామస్తులను కలచివేస్తోంది. ముత్యంపేట గ్రామ పరిధిలోని వివిధ కాలనీల్లో రోజుకో చోట కోతులు విగతజీవులుగా పడి కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా ఈ మరణాల పరంపర కొనసాగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మామిడి తోటలో కోతులపై విష ప్రయోగం జరిగి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. కోతులు తోటలోని పంటను నాశనం చేస్తున్నాయనే కక్షతోనే ఎవరో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఆరోపిస్తున్నారు. వరుసగా కోతులు మృతి చెందుతున్న విషయాన్ని గ్రామస్తులు పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జంతు ప్రేమికులు ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ, నోరులేని జీవుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు గ్రామానికి చేరుకుని మృతి చెందిన కోతుల నమూనాలను సేకరించి, కోతుల మృతికి కారణంపై ఆరా తీస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ ఏడాది వర్షాలు తక్కువేనట.. వ్యవసాయంపై ఆందోళన
పుట్టిన రోజునే మృత్యు ఒడికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
AP Heatwave Alert: ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
Telangana Weather: తెలంగాణలో పెరిగిన పగటి సమయం.. కారణం ఇదే
VijayAI Election Campaign: ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే !!
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

