ఒంగోలులోని గద్దల గుంటలో మద్యానికి బానిసైన కిషోర్ అనే వ్యక్తి తన సొంత ఇంటికి నిప్పంటించాడు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన అతని తల్లి రమణమ్మ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు కిషోర్ కోసం గాలిస్తున్నారు.