AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏఐ వైద్యం నమ్మితే ప్రాణాలకే ముప్పు! పరిశోధనల్లో తేలిన షాకింగ్ విషయాలు..!

నేడు స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా గూగుల్‌నో లేదా చాట్‌జిపిటినో అడగడం మనకు అలవాటైపోయింది. అయితే, మనం గుడ్డిగా నమ్ముతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇచ్చే వైద్య సలహాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

ఏఐ వైద్యం నమ్మితే ప్రాణాలకే ముప్పు! పరిశోధనల్లో తేలిన షాకింగ్ విషయాలు..!
Ai Medical Advice
Balaraju Goud
|

Updated on: Apr 15, 2026 | 3:37 PM

Share

నేడు స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా గూగుల్‌నో లేదా చాట్‌జిపిటినో అడగడం మనకు అలవాటైపోయింది. అయితే, మనం గుడ్డిగా నమ్ముతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇచ్చే వైద్య సలహాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

అమెరికా, కెనడా, యూకే పరిశోధకులు సంయుక్తంగా చేపట్టిన ఈ అధ్యయనంలో జెమిని, చాట్‌జిపిటి, మెటా ఏఐ, డీప్‌సీక్, గ్రోక్ వంటి ఐదు ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లను పరీక్షించారు. ఐదు వేర్వేరు ఆరోగ్య విభాగాల్లో అడిగిన ప్రశ్నలకు ఈ చాట్‌బాట్‌లు ఇచ్చిన సమాధానాలు విస్మయం కలిగించాయి. చాట్‌బాట్‌లు ఇచ్చిన సమాధానాల్లో సగం వరకు తప్పుగా ఉన్నాయి. దాదాపు 20 శాతం సమాధానాలు రోగి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. సమాచారం తప్పుగా ఉన్నప్పటికీ, ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు ఆ సమాధానాలను ఎంతో నిశ్చయంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పడం పరిశోధకులను ఆందోళనకు గురిచేసింది.

వ్యాక్సిన్‌లు, క్యాన్సర్ వంటి ప్రాథమిక అంశాలపై ఏఐ కొంతవరకు మెరుగైన సమాచారం ఇచ్చినప్పటికీ, స్టెమ్ సెల్స్, పోషణ (Nutrition), సంక్లిష్టమైన ఓపెన్-ఎండ్ ప్రశ్నల విషయంలో పూర్తిగా తడబడ్డాయి. మరీ ముఖ్యంగా, ఏ ఒక్క చాట్‌బాట్ కూడా తాను చెప్పిన సమాచారానికి సరైన వైద్య ఆధారాలను చూపలేకపోయింది. అధ్యయనంలో పాల్గొన్న ప్లాట్‌ఫారమ్‌లలో ఒక్క మెటా ఏఐ మాత్రమే రెండు సందర్భాల్లో సమాధానం చెప్పడానికి నిరాకరించి బాధ్యతాయుతంగా వ్యవహరించింది. ప్రతి వారం దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తమ ఆరోగ్య సమస్యల కోసం చాట్‌జిపిటిని ఆశ్రయిస్తున్నారని అంచనా. టెక్ కంపెనీలు ఆరోగ్య రంగంలో కొత్త సేవలను ప్రారంభిస్తున్నప్పటికీ, ఏఐకి క్లినికల్ అవగాహన, వైద్య లైసెన్స్ లేదన్నది వాస్తవం..!

గమనిక: ఏఐ చాట్‌బాట్‌లు కేవలం సమాచార సేకరణకు పనికిరావచ్చు, కానీ అవి మీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కావు. ఆన్‌లైన్ సలహాల కంటే నిపుణులైన వైద్యుడిని సంప్రదించడమే ఎల్లప్పుడూ సురక్షితం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..