ఉదయం టీ, కాఫీలకు బదులు ఆరోగ్యకరమైన పానీయాలను ప్రయత్నించమని డైటీషియన్లు సూచిస్తున్నారు. నిమ్మరసం, మెంతులు, ఉసిరికాయ, జీలకర్రతో తయారుచేసిన పానీయాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తాయి, లివర్‌ను శుభ్రపరుస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.