AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్.. అభిషేక్ శర్మకు భారీ బాధ్యత!

SRH new captain 2026: సమాచారం ప్రకారం పాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించరు. అంతేగాక, టోర్నమెంట్ ప్రారంభంలోని కొన్ని మ్యాచ్‌లలో ఆయన ఆడలేరు. కమిన్స్ స్థానంలో భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌ అభిషేక్ శర్మకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆటగాడు టి20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత తరఫున అద్భుతమైన అర్ధశతకం సాధించిన విషయం తెలిసిందే.

IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్.. అభిషేక్ శర్మకు భారీ బాధ్యత!
Sunrisers Hyderabad Captain
Rajashekher G
|

Updated on: Mar 16, 2026 | 8:42 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2026 కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 28న డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. అయితే, లభ్యమైన సమాచారం ప్రకారం పాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించరు. అంతేగాక, టోర్నమెంట్ ప్రారంభంలోని కొన్ని మ్యాచ్‌లలో ఆయన ఆడలేరు. కమిన్స్ స్థానంలో భారత టీ20 ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌ అభిషేక్ శర్మకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆటగాడు టి20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత తరఫున అద్భుతమైన అర్ధశతకం సాధించిన విషయం తెలిసిందే.

ఇక, ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా అభిషేక్ రానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నారు. దీంతో అతని స్థానంలో టీ20 స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మకు హైదరాబాద్ జట్టు పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

వెన్నునొప్పితో బాధపడుతున్న కమిన్స్.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆడలేదు. కమిన్స్ పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నుంచి 3 వారాలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిషేక్ కెప్టెన్సీలో హైదరాబాద్ జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతోందనని అభిమానుల్లో కొంత ఆసక్తి నెలకొంది.

Follow Us