AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: టీ20ల్లో 200 బాదడమే నా టార్గెట్..: కెవిన్ పీటర్సన్ ఛాలెంజ్‌లో వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్ స్టార్‌గా మారుతున్న వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు ఈ ఛాలెంజ్ ఒక నిదర్శనంగా నిలిచింది. వంద మైళ్ల వేగంతో దూసుకొచ్చే బంతులను కూడా ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ బ్యాటర్ లాగా ఆడిన తీరు నిజంగా ప్రశంసనీయం. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్‌లో వైభవ్ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Video: టీ20ల్లో 200 బాదడమే నా టార్గెట్..: కెవిన్ పీటర్సన్ ఛాలెంజ్‌లో వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi
Venkata Chari
|

Updated on: May 25, 2026 | 7:01 PM

Share

Vaibhav Sooryavanshi: ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త సంచలనం, భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్ పవర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ యూట్యూబ్ ఛానెల్ ‘ది స్విచ్’ (The Switch) వేదికగా నిర్వహించిన ఒక అసాధారణ క్రికెట్ ఛాలెంజ్‌లో వైభవ్ కేవలం 25 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించాడు.

పీటర్సన్ ఊహించని సరికొత్త ఛాలెంజ్..

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ కోసం ఒక ప్రత్యేకమైన బ్యాటింగ్ ఛాలెంజ్‌ను రూపొందించాడు. ఈ ఛాలెంజ్ ప్రకారం.. బ్యాటర్ కేవలం 50 బంతుల్లో 100 పరుగులు చేయాలి. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. బౌలింగ్ మెషిన్ ద్వారా వచ్చే ప్రతి బంతి వేగం అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది. మొదటి బంతి గంటకు 51 మైళ్ల (51 mph) వేగంతో వస్తే, చివరి బంతి నాటికి అది ఏకంగా 100 మైళ్ల (100 mph) వేగాన్ని అందుకుంటుంది. ఈ కఠినమైన సవాలును స్వీకరించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, మైదానంలో దిగిన నిమిషం నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఇవి కూడా చదవండి

సిక్సర్ల సునామీ.. వంద మైళ్ల వేగానికి దీటైన సమాధానం..

వైభవ్ క్రీజులోకి రాగానే తన అద్భుతమైన బ్యాట్ స్పీడ్‌తో బంతిని బౌండరీల అవతలకు పంపడం ప్రారంభించాడు. మొదటి బంతికే సిక్సర్‌తో ఖాతా తెరిచిన ఈ యువ సంచలనం, ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్లో మూడు భారీ సిక్సర్లు బాదాడు. బంతి వేగం పెరుగుతున్న కొద్దీ వైభవ్ టైమింగ్, రిస్ట్ కంట్రోల్ మరింత మెరుగయ్యాయి. కేవలం 10 బంతుల్లోనే 8 సిక్సర్ల సాయంతో అర్ధశతకం (53 పరుగులు) పూర్తి చేసుకుని పీటర్సన్‌ను సైతం నోరెళ్లబెట్టేలా చేశాడు. గాల్లోకి బ్యాట్ ఎత్తుతూ తనదైన శైలిలో హాఫ్ సెంచరీ వేడుకలను జరుపుకున్నాడు.

టి20ల్లో 200 పరుగులే నా లక్ష్యం!

ఈ ఛాలెంజ్ మధ్యలో పీటర్సన్‌తో మాట్లాడిన వైభవ్, తన మనసులోని పెద్ద ఆశయాన్ని బయటపెట్టాడు. టి20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ నెలకొల్పిన 175 పరుగుల అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టడమే తన లక్ష్యమని, టి20ల్లో డబుల్ సెంచరీ (200 పరుగులు) సాధించడమే తన అంతిమ ధ్యేయమని ధీమాగా చెప్పాడు. అంతేకాదు, గతంలో ఆసియా కప్ ఎమర్జింగ్ టోర్నీలో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నానని, దేశవాళీ వన్డే మ్యాచ్‌లో ఏకంగా 335 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచానని గుర్తుచేశాడు .

గూగుల్ జెమిని ఏమందంటే?

వైభవ్ ఆడుతున్న అద్భుతమైన షాట్లను చూసి ఆశ్చర్యపోయిన కెవిన్ పీటర్సన్, ఈ 15 ఏళ్ల కుర్రాడిలో ఉన్న అంతటి ప్రత్యేకత ఏంటో తెలుసుకోవడానికి ‘గూగుల్ జెమిని’ (Google Gemini) ఏఐ సాయం తీసుకున్నాడు. వైభవ్ బ్యాటింగ్ శైలిని విశ్లేషించిన జెమిని.. అతనికి ఉన్న అసాధారణ బ్యాట్ స్పీడ్, అద్భుతమైన మణికట్టు కదలికలు (wrist control) అత్యంత వేగంగా వచ్చే బంతులను సైతం ఈజీగా బౌండరీ దాటించడానికి ఉపయోగపడుతున్నాయని పేర్కొంది. అలాగే ఏమాత్రం భయం లేని అతని ఫీర్-లెస్ మైండ్‌సెట్ అతడిని ప్రత్యేకంగా నిలుపుతుందని స్పష్టం చేసింది.

చివరకు కేవలం 25 బంతుల్లోనే 14 సిక్సర్ల సునామీతో వైభవ్ సూర్యవంశీ ఈ 100 పరుగుల మైలురాయిని అధిగమించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
10 కోట్లతో తీస్తే 1000 కోట్ల కలెక్షన్లు.. అంతలా ఏముందీ సినిమాలో..
10 కోట్లతో తీస్తే 1000 కోట్ల కలెక్షన్లు.. అంతలా ఏముందీ సినిమాలో..
Video: నా టార్గెట్ 200: వైభవ్ సూర్యవంశీ
Video: నా టార్గెట్ 200: వైభవ్ సూర్యవంశీ
ఈ తేదీల్లో పుట్టారా? అయితే డబ్బు, విలాస జీవితం మీ వెంటే!
ఈ తేదీల్లో పుట్టారా? అయితే డబ్బు, విలాస జీవితం మీ వెంటే!
బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్‌మెన్ ఊహించని..
బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్‌మెన్ ఊహించని..
జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?
జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
‘వాళ్లంతా తోపులేమో’.. ఒక్క మాటతో ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్..!
‘వాళ్లంతా తోపులేమో’.. ఒక్క మాటతో ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్..!
కోవిడ్ తెచ్చిన సరికొత్త ముప్పు,యువతలో పెరిగిన నడుము కీలు మార్పిడి
కోవిడ్ తెచ్చిన సరికొత్త ముప్పు,యువతలో పెరిగిన నడుము కీలు మార్పిడి
ఫెంగ్ షుయ్ వాస్తు.. ఈ విగ్రహాలను ఇంటికి తెచ్చుకుంటే డబ్బే డబ్బు..
ఫెంగ్ షుయ్ వాస్తు.. ఈ విగ్రహాలను ఇంటికి తెచ్చుకుంటే డబ్బే డబ్బు..
వాస్తు ప్రకారం ఈ వస్తువులను చేతికి ఇవ్వడం అశుభం.. లేకపోతే నష్టాలు
వాస్తు ప్రకారం ఈ వస్తువులను చేతికి ఇవ్వడం అశుభం.. లేకపోతే నష్టాలు