AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027 : ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు హ్యాండివ్వనున్న ఢిల్లీ.. ఆపరేషన్ 2027 షురూ

IPL 2027 : రాబోయే మెగా వేలం కోసం తమ పర్స్ వాల్యూను పెంచుకునేందుకు ఏకంగా రూ.34.50కోట్ల విలువైన ఐదుగురు ఆటగాళ్లను వదిలేయాలని ఢిల్లీ టీం యాజమాన్యం నిర్ణయించింది. సుదీర్ఘ కాలంగా ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిరాశ ఈ ఏడాది కూడా కొనసాగింది.

IPL 2027  : ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు హ్యాండివ్వనున్న ఢిల్లీ.. ఆపరేషన్ 2027 షురూ
Delhi Capitals
Rakesh
|

Updated on: May 25, 2026 | 8:18 PM

Share

IPL 2027 : ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరికొత్త వ్యూహాలకు తెరలేపింది. అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఈ జట్టు మరోసారి కప్పు గెలవకుండానే తన ప్రయాణాన్ని ముగించింది. దీంతో రాబోయే మెగా వేలం కోసం తమ పర్స్ వాల్యూను పెంచుకునేందుకు ఏకంగా రూ.34.50కోట్ల విలువైన ఐదుగురు ఆటగాళ్లను వదిలేయాలని యాజమాన్యం నిర్ణయించింది. సుదీర్ఘ కాలంగా ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిరాశ ఈ ఏడాది కూడా కొనసాగింది. 2026 సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో ఈ జట్టు పట్టికలో 6 వ స్థానంలో నిలిచింది. చివరి మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి, కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించినప్పటికీ ప్లేఆఫ్స్ చేరలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2027 టోర్నీ కోసం ఇప్పటి నుంచే భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. వేలంలో కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి వీలుగా జట్టులోని కొందరు కీలక ఆటగాళ్లను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.

కుల్దీప్ యాదవ్

ఈ జాబితాలో అందరినీ ఆశ్చర్యపరిచే పేరు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. గతంలో జట్టుకు ఎన్నో విజయాలు అందించినప్పటికీ, ఈ సీజన్ లో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఆడిన 11 ఇన్నింగ్స్‌లలో కేవలం 10 వికెట్లు మాత్రమే తీసి, 10.30 ఎకానమీతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతన్ని జట్టు నుంచి రిలీజ్ చేయడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి ఏకంగా రూ.13.25 కోట్ల భారీ మొత్తం తిరిగి లభిస్తుంది.

నటరాజన్ పై వేటు

ఢిల్లీ జట్టుకు ఈ సీజన్‌లో బౌలింగ్ విభాగమే అతిపెద్ద బలహీనతగా మారింది. ఇందుకోసం రూ.10.75 కోట్ల భారీ ధరతో కొనుగోలు చేసిన లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ పూర్తిగా విఫలమయ్యాడు. అతను ఆడిన 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు కూడా 11.18 గా నమోదైంది. మరోవైపు 8 కోట్ల రూపాయల భారీ ధర కలిగిన ముఖేష్ కుమార్ సైతం 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 6 వికెట్లు మాత్రమే తీసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఇద్దరినీ వదులుకోవడం ద్వారా జట్టుకు దాదాపు 18 కోట్ల 75 లక్షల రూపాయలు కలిసి రానున్నాయి.

కరుణ్ నాయర్, ఇంగ్లాండ్ ఆటగాడు అవుట్

బ్యాటింగ్ విభాగంలో కేవలం రూ.50 లక్షల బేస్ ప్రైస్ కలిగిన కరుణ్ నాయర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో ఆడిన 2 ఇన్నింగ్స్‌లలో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో అతను రెండు కీలక క్యాచ్‌లు వదిలేయడం జట్టు ఓటమికి కారణమైంది. వీరితో పాటు ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో 75 లక్షలకు వచ్చిన రెహాన్ అహ్మద్‌కు కనీసం ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. డకెట్ స్థానాన్ని రద్దు చేయడం వల్ల రూ.2 కోట్ల పర్స్ వాల్యూ జట్టుకు దక్కుతుంది. ఈ ఐదుగురు ఆటగాళ్లను వదిలించుకోవడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలోకి మొత్తం రూ.34.50 కోట్ల భారీ బడ్జెట్ అందుబాటులోకి రానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి