AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi: ఓవైపు ఫ్యామిలీ ఎమోషన్స్.. మరోవైపు మాస్

Irumudi: ఓవైపు ఫ్యామిలీ ఎమోషన్స్.. మరోవైపు మాస్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 15, 2026 | 11:25 PM

Share

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇరుముడి’ ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కేవలం భక్తి కథగా కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్‌, మాస్‌ ఎలిమెంట్స్‌, థ్రిల్లర్‌, భక్తిని కలిపిన కథగా సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్‌ సూచిస్తోంది. కూతురి కోసం తన జీవితాన్ని మార్చుకునే తండ్రి పాత్రలో రవితేజ కనిపించనున్నారు. ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 21న సినిమా విడుదల కానుంది.

ఇరుముడి సినిమా అంటే ఇన్నాళ్లూ భక్తి ఎక్కువగా ఉంటుంది.. రవితేజ పూర్తిగా క్లాస్ రూట్‌లోకి వచ్చేసారేమో అనుకున్నారంతా. కానీ లోపల అదే మాస్.. అదే రచ్చ.. అని ట్రైలర్ చూసాక అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఒకే ట్రైలర్‌లో చాలా చూపించారు.. చాలా ప్రశ్నించారు.. ఎన్నో అనుమానాలు కూడా పెట్టేసారు శివ నిర్వాణ. మరి ఇరుముడి ట్రైలర్ రివ్యూ ఏంటో చూద్దామా.. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్.. పైగా భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇరుముడి కూడా అలాగే ఉంటుందనుకున్నారంతా. ఇప్పటి వరకు వచ్చిన విజువల్స్‌లో కూడా పెద్దగా మాస్ చూపించలేదు మేకర్స్. కానీ ట్రైలర్‌లో మొత్తం ఒకేసారి చూపించారు.. సినిమా ఎలా ఉండబోతుందో 3 నిమిషాల ట్రైలర్‌లో కళ్లకు కట్టేసారు. ఇరుముడి అనేది కేవలం భక్తి సినిమా మాత్రమే కాదని ట్రైలర్‌తోనే అర్థమైపోయింది. ఓవైపు ఫ్యామిలీ ఎమోషన్స్.. మరోవైపు మాస్.. ఇంకోవైపు భక్తి.. మరోవైపు థ్రిల్లర్ ఇలా అన్నింటినీ మిక్స్ చేసారు శివ నిర్వాణ. కాసేపు మందు లేకపోతే పిచ్చెక్కిపోయే ఒక తండ్రి.. కూతురు కోసం ఎంత మారిపోయాడు.. ఏం చేసాడు అనేదే ఇరుముడి కథ. ఈ సినిమాతో శివ కూడా తన రూట్ మార్చేసారు. ఇరుముడి కోసం రవితేజ కూడా మారిపోయారు. ఇదివరకు మాస్ యాక్షన్ అంటూ రొటీన్ కథల వెంట పడ్డ మాస్ రాజా.. ఇరుముడిలో ఓ మంచి గ్రిప్పింగ్ కథతో వస్తున్నారని అర్థమైపోతుంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కూతురుగా బేబీ నక్షత్ర అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఆగస్ట్ 21న విడుదల కానుంది ఇరుముడి. మరి ఈ చిత్రంతో రవితేజ ఏం మాయ చేయబోతున్నారో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం

పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్‌

ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్‌ఈసీసీ సంచలన నివేదిక!

10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!

Follow Us