AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం

Phani CH
|

Updated on: Aug 15, 2026 | 10:41 PM

Share

చంద్రుడి దక్షిణ ధ్రువంపై భవిష్యత్ వ్యోమగాముల కోసం శాశ్వత ఆవాసాన్ని నిర్మించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని భారత్‌ను నాసా ఆహ్వానించింది. బెంగళూరులో జరిగిన భారత్‌-అమెరికా పౌర అంతరిక్ష ఉమ్మడి కార్యాచరణ బృందం సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఆర్టెమిస్‌ ఒప్పందం కింద సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. శాస్త్రీయ సమాచారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంతో పాటు భవిష్యత్‌ సుదూర అంతరిక్ష యాత్రలకు కలిసి పనిచేయనున్నారు.

రోదసి రంగంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారత్ మధ్య సహకారం మరింత బలపడుతోంది. ఇందులో భాగంగా చందమామ దక్షిణ ధ్రువంపై నిర్మించతలపెట్టిన తొలి ఆవాస ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని భారత్‌కు నాసా అధికారికంగా ఆహ్వానం పలికింది. వ్యోమగాములు నివసించడానికి, పరిశోధనలు సాగించడానికి ఈ శాశ్వత ఆవాసాన్ని నిర్మించనున్నారు. భవిష్యత్‌లో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు సన్నాహాలు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇరు దేశాల పౌర అంతరిక్ష ఉమ్మడి కార్యాచరణ బృందం గత వారం బెంగళూరులో సమావేశమైంది. ఆర్టెమిస్‌ ఒప్పందం కింద ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే అంశంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగానే చంద్రుడిపై ఆవాసాల నిర్మాణ ప్రాజెక్టులో చేరాల్సిందిగా ఇస్రోను నాసా కోరినట్లు సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది. శాస్త్రీయ సమాచారాన్ని పరస్పరం పంచుకోవడంపై రెండు సంస్థలు సంపూర్ణ అంగీకారం తెలిపాయి. అలాగే ‘ట్రస్ట్‌’ కార్యక్రమం కింద పౌర, వాణిజ్య అంతరిక్ష సహకారాన్ని బలోపేతం చేసుకోవడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. రక్షణ, కృత్రిమ మేధ, క్వాంటమ్, బయోటెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యంత కీలక రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని నిర్ణయించారు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్, అమెరికా రాయబారి సెర్గియో గోర్‌లు పాల్గొని ఇరు దేశాల మధ్య అంతరిక్ష సహకారం ప్రాముఖ్యతను వివరించారు. ఈ చారిత్రాత్మక ఆహ్వానంతో భారత్-అమెరికా అంతరిక్ష సంబంధాలు కొత్త శిఖరాలను తాకనున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్‌

ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్‌ఈసీసీ సంచలన నివేదిక!

10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!

నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!

Follow Us