AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలుసా..? ఇక కష్టమే..

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత వారంలో భారీగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల క్రమంలో బంగారం ధరలపై ప్రభావితం పడుతుంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలుకావడం, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచనుందనే అంచనాల క్రమంలో బంగారం ధరలు పెిరగాయి.

Venkatrao Lella
|

Updated on: Aug 16, 2026 | 10:42 AM

Share
బంగారం ధరలు గత వారంలో భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు మళ్లీ మొదలుకావడంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక అమెరికా ఆర్ధిక గణాంకాలు బలహీనపడటం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయనే అంచనాలు వెలువడంతో గోల్డ్ రేట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గత వారంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

1 / 5
ఆగస్ట్ 10వ తేదీ నుంచి శనివారం వరకు హైదరాబాద్ బులియన్ మార్కె్ట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3160 పెరిగింది. ప్రస్తుతం ధరలు రూ.1,55,130 వద్ద కొనసాగుతున్నాయి. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.2900 పెరగ్గా.. రూ.1,42,200కి చేరుకుంది.  ఇక కిలో వెండి గత వారంలో రూ.5 వేల మేర పెరిగింది.

2 / 5
ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది. గత వారంలో ఏకంగా 0.86 శాతం గోల్డ్ రేట్లు పెరిగాయి. మధ్యప్రాచర్యంలో ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న పరిణామాలతో ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీంతో పాటు భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత, వివిధ దేశాల కరెన్సీ విలువల్లో మార్పులతో ధరలు పెరుగుతున్నాయి.

3 / 5
శుక్రవారం ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ (అక్టోబర్) 0.73 శాతం లాభపడి రూ.1,54,590 వద్ద నిలిచాయి. ఇక ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ (సెప్టెంబర్) 0.15 శాతం పెరిగి కిలోకు రూ. 2,36,272 వద్ద ట్రేడయ్యాయి. మధ్యప్రాచ్యర్యంలో ఉద్రిక్తతలతో పాటు ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం, అమెరికా డాలర్ బలహీనపడటం వంటి కారణాల వల్ల బంగారం, వెండి ధరలు పెరిగినట్లు ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు.

4 / 5
రెండు నెలల తర్వాత బంగారం ధరలు మళ్లీ గరిష్ట స్థాయిని అందుకున్నాయి. హోర్ముజ్ జలసంధికి సంబంధించి అమెరికా-ఇరాన్‌లు పరిష్కారం చూపుతాయనే ఆశలు సన్నగిల్లాయి. దీంతో గత వారం అమ్మకాల ఒత్తిడి నుంచి ముడి చమురు ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ముడి చమురు ధరలు వారం మధ్యలో ఉన్న గరిష్ట స్థాయిల నుండి తగ్గినప్పటికీ.. WTI, బ్రెంట్ రెండూ ఈ వారంలో మంచి లాభాలను నమోదు చేశాయి.

5 / 5
Follow Us