AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'పోలీస్ కంపెనీ' కొత్త సినిమా ప్రకటించిన RGV

‘పోలీస్ కంపెనీ’ కొత్త సినిమా ప్రకటించిన RGV

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 15, 2026 | 11:19 PM

Share

ఒకప్పుడు ట్రెండ్‌ సెట్టింగ్‌ సినిమాలతో సంచలనం సృష్టించిన రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పుడు చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ‘పోలీస్ కంపెనీ’ పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. పోలీస్ వ్యవస్థకు అధిక అధికారాలు ఇస్తే అది ఎలా ఒక శక్తివంతమైన వ్యవస్థగా మారుతుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ముంబై అండర్‌వరల్డ్‌, గ్యాంగ్‌వార్స్‌ నేపథ్యంలో సాగే కథలో దయా నాయక్‌ పాత్రను హర్షవర్ధన్ రాణే పోషిస్తున్నారు.

ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు కేవలం ట్విట్టర్‌కే పరిమితమైపోయారు. ఒకవేళ కమ్‌బ్యాక్ ఇస్తానని చెప్పినా.. ఈ టైంలో వర్మను నమ్మడం కష్టమే. కానీ ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అంటున్నారీయన. మరి RGV ఈసారి సీరియస్సా.. నిజంగానే కమ్ బ్యాక్ ఇస్తారా..? అసలు ఆయనేం సినిమా చేస్తున్నారు..? రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరులో ఒకప్పుడు క్రియేటివిటీ ఉండేది కానీ కొన్నేళ్లుగా కాంట్రవర్సీ మాత్రమే కనిపిస్తుంది. మనోడు మాట్లాడినా, మౌనంగా ఉన్నా వివాదమే. నేను మారిపోయానని చెప్పినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఆ మధ్య నేను మారిపోయాను.. ఇకపై అన్నీ మంచి సినిమాలే తీస్తానన్నారు. అప్పట్నుంచి వర్మ నుంచి సినిమాలే రాలేదు. చాలా రోజుల తర్వాత వర్మ కొత్త సినిమా అనౌన్స్ చేసారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్‌ మే భూత్ అనే సినిమా చేస్తున్నా అది బయటికి రాలేదు. ఈ సమయంలో పోలీస్ కంపెనీ సినిమా ప్రకటించారు వర్మ. ఇట్ ఈజ్ మోర్ డేంజరెస్ దెన్ D కంపెనీ అనేది ట్యాగ్ లైన్. పోలీస్ వ్యవస్థకు అదనపు అధికారాలు ఇస్తే… అది క్రమంగా ఒక కంపెనీగా ఎలా మారుతుందనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దావూద్-చోటా రాజన్ విభేదాల తర్వాత ముంబై అండర్‌ వరల్డ్‌లో ఏర్పడిన పరిస్థితులు, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని.. 1997–2004 మధ్య 300 మందికి పైగా గ్యాంగ్‌స్టర్స్‌ను చంపిన స్పెషల్ పోలీస్ స్క్వాడ్ నుంచి ఈ కథకు స్ఫూర్తి పొందినట్లు వర్మ తెలిపారు. ఆ స్క్వాడ్‌ మెంబర్ దయా నాయక్ పాత్రలో హర్షవర్ధన్ రాణే నటిస్తున్నారు. మరి ఈ చిత్రంతో అయినా వర్మ ఫామ్‌లోకి వస్తారా అనేది చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం

పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్‌

ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్‌ఈసీసీ సంచలన నివేదిక!

10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!

Follow Us