AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుకుమార్, రామ్ చరణ్ సినిమాకు సర్వం సిద్ధం

సుకుమార్, రామ్ చరణ్ సినిమాకు సర్వం సిద్ధం

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 15, 2026 | 10:59 PM

Share

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17పై అంచనాలు పెరుగుతున్నాయి. చరణ్ మణికట్టు గాయం, సర్జరీ కారణంగా సినిమా ప్రారంభం కొంత ఆలస్యమవుతోంది. ఈ గ్యాప్‌లో సుకుమార్ కథను సిద్ధం చేసి ఫైనల్ నెరేషన్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం. రంగస్థలం తర్వాత మరోసారి కలుస్తున్న ఈ కాంబోలో చరణ్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో ముహూర్తం, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఇంకా మొదలు కూడా కాకముందే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కాబోతుంది..? సుకుమార్ కథ సిద్ధం చేసారా..? ఫైనల్ నెరేషన్ ఎప్పుడు..? పుష్ప తరహాలో రా అండ్ రస్టిక్ కథ చేయబోతున్నారా లేదంటే చరణ్ కోసం లెక్కల మాస్టారు కొత్తగా ఏమైనా లెక్కలేస్తున్నారా..? RC17 అప్‌డేట్స్‌పై స్పెషల్ స్టోరీ.. పెద్ది తర్వాత గ్యాప్ లేకుండా సుకుమార్ సినిమా చేయాలనుకున్నారు రామ్ చరణ్. కానీ అనుకోకుండా మణికట్టు గాయం, సర్జరీతో మరో మూన్నెళ్లు ఆలస్యమవుతుంది. కాకపోతే ఈ గ్యాప్‌లో కథ సిద్ధం చేసి ఫైనల్ నెరేషన్‌కు సిద్ధమవుతున్నారు సుకుమార్. రంగస్థలం తర్వాత రిపీట్ అవుతున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు మ్యాచ్ చేసేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు సుక్కు. రంగస్థలం నుంచి రా అండ్ రస్టిక్ కథలవైపు షిఫ్ట్ అయిపోయారు సుకుమార్. మరోవైపు రామ్ చరణ్ కూడా పెద్దితో పూర్తిగా రూరల్ డ్రామానే చేసారు. అయితే ఈసారి చరణ్‌తో ఓ డిఫెరెంట్ అటెంప్ట్ చేయాలని చూస్తున్నారు లెక్కల మాస్టారు. కథపై క్లారిటీ రాలేదు కానీ RC17లో చరణ్ రెండు డిఫెరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారనేది మాత్రం తెలుస్తుంది. గతంలో మగధీర, నాయక్, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాల్లో డ్యూయల్ రోల్ చేసారు చరణ్. సుక్కు సినిమాలోనూ రెండూ వేటికవే భిన్నంగా ఉండే పాత్రలు చేయబోతున్నారు. అన్నీ కుదిర్తే అక్టోబర్‌లో ముహూర్తం పెట్టి.. జనవరి నుంచి సెట్స్‌పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి రంగస్థలం తర్వాత వస్తున్న కాంబో.. తమ ముందు సినిమాను మరిపించేలా మ్యాజిక్ చేస్తారా లేదా అనేది చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం

పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్‌

ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్‌ఈసీసీ సంచలన నివేదిక!

10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!

Follow Us