AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మావ.. క్రేజీ హారర్ థ్రిల్లర్ మూవీ కావాలా..! సీన్ సీన్‌కు నరాలు తెగిపోతాయి.. ఎక్కడ చూడొచ్చంటే

చాలా మంది సినీ లవర్స్ హారర్ సినిమాలు చూడటానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎంత భయంగా అనిపించినా కూడా కళ్లు మూసుకుంటూనే చూసేవారు చాలా మంది ఉంటారు. కానీ ఒంటరిగా చూడాలంటే మాత్రం భయమే. ఓటీటీల్లోనూ హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కేవలం తెలుగులో సినిమాలు మాత్రమే కాదు ఇతరభాషల హారర్ సినిమాలు చూడటానికి కూడా ప్రేక్షకులకు ఆసక్తి చూపిస్తున్నారు.

మావ.. క్రేజీ హారర్ థ్రిల్లర్ మూవీ కావాలా..! సీన్ సీన్‌కు నరాలు తెగిపోతాయి.. ఎక్కడ చూడొచ్చంటే
Horror Movie
Rajeev Rayala
|

Updated on: May 06, 2025 | 5:50 PM

Share

ఓటీటీలో ప్రతి శుక్రవారం రకరకాల సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుం ఉంటాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ప్రతి శుక్రవారం ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల జోనర్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు ఏమాత్రం ఖాళీ దొరికినా కూడా ఓటీటీలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ లో విడుదలైన సినిమాలను ఓటీటీలో మళ్లీ మళ్లీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇతర బాషల సినిమాలను కూడా ఓటీటీలో చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సినీ లవర్ ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో హారర్ సినిమాలు ముందు వరసలో ఉంటాయి. ఇప్పటికే ఎన్నో రకాల హారర్ సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ఇప్పటివరకు చూడని విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అంతే కాదు భారీ బడ్జెట్ తో ఈ భయంకర సినిమాను రూపొందించారు.

ఈ సినిమాను ఏకంగా రూ.50 కోట్లతో నిర్మించారు. అలాగే భారీగా వసూల్ చేసింది ఆ సినిమా.. ఇంతకూ ఈ హారర్ సినిమాలో ఏముందంటే.. ఈ చిత్రం ఇద్దరు యువ మోర్మన్ మిషనరీలు, సిస్టర్ బర్న్స్ (సోఫీ థాచర్), సిస్టర్ పైక్ (క్లోయ్ ఈస్ట్), చుట్టూ తిరుగుతుంది. ఈ ఇద్దరూ తమ మత సందేశాన్ని పంచుకోవడానికి ఇంటింటికీ తిరుగుతూ ఉంటారు. ఒక రోజు, వారు మిస్టర్ రీడ్ (హ్యూ గ్రాంట్) అనే  మేధావి వ్యక్తి ఇంటికి వెళ్తారు. అతను మతం గురించి చర్చించడానికి ఆసక్తి చూపిస్తాడు, కానీ అంతలోనే అతని నిజస్వరూపం బయటపడుతుంది. మిస్టర్ రీడ్ ఒక మతోన్మాది, మానసిక వక్రబుద్ధి కలిగిన వ్యక్తిగా తేలుతుంది. అతను ఈ యువతులను తన ఇంటిలో బందీలుగా చేస్తాడు. అతను వారిని ఒక భయానక మత ప్రయోగంలో భాగం చేస్తాడు. ఇందులో వారి విశ్వాసాలను పరీక్షించే ఒక భయంకరమైన ఆటను ఆడమని బలవంతం చేస్తాడు. ఈ ఆటలో వారు సరైన “విశ్వాసాన్ని” ఎంచుకోవాలి, లేకపోతే మరణం తప్పదు. ఈ ప్రక్రియలో, మిస్టర్ రీడ్ మతం, విశ్వాసం, నీతి గురించి వక్రీకరించిన తాత్విక వాదనలను చేస్తుంటాడు. ఈ చిత్రం భయానకంతో పాటు మత విశ్వాసాలు, మానసిక హింస,  మానవ మనస్తత్వంలోని చీకటి కోణాలను చూపిస్తుంది.

ఈ సినిమాలోని ప్రతి సీన్ ఎంతో భయంకరంగా ఉంటుంది. సీన్ సీన్ కు నెక్ట్స్ ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే.. ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు కంప్లీట్‌ హారర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ను అందిస్తాయి. రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హెరెటిక్ బాక్సాఫీస్ వద్ద రూ.177.96 కోట్లు సంపాదించింది. ఈ హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగడుతుంది. ఈ సినిమా మ్యాక్స్‌లో అందుబాటులో ఉంది.ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..