AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాక్షన్ సీన్స్ లేవు.. స్పెషల్ సాంగ్స్ లేవు..! కానీ కల్కి, పుష్ప 2 సినిమాలను బీట్ చేసింది

థియేటర్స్ లో కొత్త సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాది చాలా పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఆ సినిమాలను బీట్ చేసి ఓ చిన్న సినిమా.. సింపుల్ సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది.

యాక్షన్ సీన్స్ లేవు.. స్పెషల్ సాంగ్స్ లేవు..! కానీ కల్కి, పుష్ప 2 సినిమాలను బీట్ చేసింది
Movie
Rajeev Rayala
|

Updated on: May 04, 2025 | 4:15 PM

Share

కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకుంటాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో అలరిస్తాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం హృదయానికి హత్తుకుంటాయి.. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే ఇప్పుడు నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ అంటూ రచ్చ లేదు.. డబుల్ మీనింగ్ డైలాగ్స్, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ లేవు కానీ ఆ సినిమా భారీ హిట్ అందుకుంది. పెద్ద కథ కూడా కాదు.. కానీ ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా..? అది సైలెంట్‌గా వచ్చి, ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న ఒక ఎమోషనల్ డ్రామా.. ఏకంగా 8.4 IMDb రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఎదో తెలుసా.?

ఇది కూడా చదవండి : ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఆమె ఎవరంటే

గత ఏడాది చాలా సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్స్ చాలానే విడుదలయ్యాయి. పుష్ప 2, కల్కి 2898 AD లాంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి. తెలుగులోనే కాదు బాలీవుడ్, తమిళ్ లోనూ ఎన్నో బడా సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాలు ఏవీ అందుకోలేని ఓ రికార్డ్ ను ఓ చిన్న సినిమా అందుకుంది. ఆ సినిమా ఎదో కాదు తమిళ్ లో తెరకెక్కిన మెయియఝగన్. ఇదే సినిమా తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ అయ్యింది.

ఇది కూడా చదవండి :థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఆ అమ్మడి స్పెషల్ సాంగ్..

ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. సింపుల్ కథ.. ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అందరిని ఏడిపించింది. 2024లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఈ సినిమాకు  ‘96’ లాంటి ఎమోషనల్ హిట్‌ను అందించిన సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 8.4 IMDb రేటింగ్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Sathyam Sundaram

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి