AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసిన సినిమాలన్నీ ఫ్లాప్..! ఇప్పుడు యంగ్ హీరో మూవీపై ఆశలు పెట్టుకున్న గ్లామర్ క్వీన్..

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నారు. అలాగే మరికొంతమంది మాత్రం ఒక్క సినిమాతోనే పాపులర్ అవుతున్నారు. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా వరుస సినిమాలతో బిజీగా మారింది.

చేసిన సినిమాలన్నీ ఫ్లాప్..! ఇప్పుడు యంగ్ హీరో మూవీపై ఆశలు పెట్టుకున్న గ్లామర్ క్వీన్..
Tollywood
Rajeev Rayala
|

Updated on: May 05, 2025 | 4:58 PM

Share

అందం అభినయం ఉన్నా కూడా చాలా మంది హీరోయిన్స్ అదృష్టం కలిసి రాక రేస్ లో వెనకపడుతున్నారు. సినిమా అవకాశాలు అందుకుంటున్నా కూడా సరైన హిట్స్ లేక స్టార్ డమ్ తెచ్చుకోలేకపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోతున్నారు. అలాంటి వారిలో ఈ క్రేజీ బ్యూటీ ఒకరు.. అందం అభినయం ఉన్న ఈ గ్లామర్ బ్యూటీ తన వయ్యారంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. కానీ అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. హీరోయిన్ గానే కాదు.. గెస్ట్ రోల్స్ చేసింది. అలాగే స్పెషల్ సాంగ్ కూడా చేసింది.. అయినా స్టార్ డమ్ అందుకోలేకపోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

చేసింది కొన్ని సినిమాలే కానీ ఆ సినిమాల్లో పెద్ద హిట్ అయినా సినిమా ఒకటి కూడా లేదు. కానీ గ్లామర్ లో మాత్రం అప్సరసే.. ఆమె ఎవరో కాదు కేజీ బ్యూటీ డింపుల్ హయాతి. డింపుల్ హయాతి 2017లో ‘గల్ఫ్’ సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. ఆతర్వాత  2019లో యురేక సినిమాలో నటించింది. అయినా కూడా గుర్తింపు రాలేదు. అదే సమయంలో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘జర్ర జర్ర ‘ పాటలో నటించింది. ఈ పాటలో హాట్ లుక్ లో మెరిసి ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఆతర్వాత రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో మరోసారి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. చివరిగా రామబాణం అనే సినిమాలో కనిపించింది. కానీ ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి నటిస్తుంది డింపుల్. బోగి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో డింపుల్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇటీవలే ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమా పై డింపుల్ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ చిన్నదానికి హిట్ అందుతుందేమో చూడాలి.

View this post on Instagram

A post shared by Dimple 🌟 (@dimplehayathi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!