AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెరీర్ పీక్‌లో ఉండగానే పెద్ద యాక్సిడెంట్.. రెండేళ్ల బెడ్‌ పైనే.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

చాలా మంది హీరోయిన్స్ స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవ కొనసాగుతుండటంతో ఇప్పుడు హీరోయిన్స్ పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న నటిని గుర్తుపట్టారా.? కెరీర్ బిగినింగ్ లోనే పెద్ద యాక్సిడెంట్ కు గురైంది.

కెరీర్ పీక్‌లో ఉండగానే పెద్ద యాక్సిడెంట్.. రెండేళ్ల బెడ్‌ పైనే.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా
Actress
Rajeev Rayala
|

Updated on: May 03, 2025 | 6:23 PM

Share

చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా కూడా స్టార్ డమ్ దక్కించుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న భామ ఒకరు. తన అందంతో కుర్రాళ్లను మాయలో పడేసింది ఈ చిన్నది. అలాగే నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. కెరీర్ లో ఒకే ఒక్క భారీ హిట్ అందుకుంది ఆ బ్యూటీ. కెరీర్ పీక్ లో ఉండగానే యాక్సిడెంట్ కు గురయ్యింది. అదృష్టం కొద్దీ  ప్రాణాలతో బయటపడింది. దాదాపు రెండేళ్లు బెడ్ కే పరిమితం అయ్యింది.ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది పై ఫొటోలో ఉన్న భామ. కెరీర్ స్టార్టింగ్ లోనే భారీ హిట్ అందుకుంది. ఆతర్వాత కొన్ని ఫ్లాప్స్ అందుకుంది. కెరీర్ పీక్ లో ఉండగానే యాక్సిడెంట్ కు గురయ్యింది. ఆమె ఎవరంటే అందాల నభా నటేష్.  నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అందుకుంది. అయితే ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్న సమయంలో ఊహించని విధంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో నభా  తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమె రెండేళ్లు బెడ్ పైనే ఉండాల్సి వచ్చింది. ఇక కోలుకున్న తర్వాత తిరిగి సినిమాలతో బిజీగా మారింది. మొన్నామధ్య డార్లింగ్ అనే సినిమా చేసింది కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు స్వయంభు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిన్నది సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నభా .. హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది.

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి