HIT 3 Movie: దొరికేసింది.. హిట్ 3 సినిమాలో నానితో ఫైట్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? బ్యాక్ గ్రౌండ్ ఇదే
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం హిట్-3: ది థర్డ్ కేస్. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సైకో అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పటికే వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉంటే హిట్ 3 సినిమాలో నటించిన ఓ అమ్మాయి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం హిట్-3: ది థర్డ్ కేస్. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే సూర్య శ్రీనివాస్, రావు రమేష్, సముద్ర ఖని, కోమలి ప్రసాద్, నెపోలియన్, రవీంద్ర విజయ్, ప్రతీక్ బబ్బర్, టిస్కా చోప్రా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే కొందరు స్టార్ హీరోలు క్యామియో రోల్స్ లో కనిపించారు. అయితే ఈ హిట్ 3 సినిమాలో నటించిన ఓ అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిట్ 3 సినిమా సెకండ్ హాఫ్ లో లో నానితో ఓ అమ్మాయి సూపర్బ్ ఫైట్ చేస్తుంది. ఎంతో క్యూట్ గా ఉండే ఈ అమ్మాయి నానితో బాగా ఫైట్ చేసి ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఎవరీ అమ్మాయి? అని నెటిజన్లు గూగుల్ లో తెగ సర్చ్ చేస్తున్నారు. చివరకు ఆ నటి అధికారిక ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను కూడా కనుక్కున్నారు. ఇంకేముంది అందరూ ఈ బ్యూటీని తెగ ఫాలో చేస్తున్నారు. ఒక్క సినిమాతోనే ఇంత ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ నటి పేరు నిధి సింగ్. ముంబైలో మోడల్ గా వర్క్ చేస్తోంది. ఇప్పటికే పలు యాడ్స్ చేసిందని తెలుస్తుంది. అలాగే కొన్ని హిందీ సినిమాలకు కూడా పని చేసిందని తెలుస్తోంది. తెలుగులో మాత్రం హిట్ 3నే మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత తెలుగులో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయంటోంది నిధి.
కాగా తెలుగు ప్రేక్షకులు తన పట్ల, తన సినిమా పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలు చూసి నిధి సింగ్ ఆనందంతో తెగ సంబరపడిపోతోంది. తెలుగు మీమ్ పేజీలు వేసిన పలు పోస్ట్ లను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి థ్యాంక్స్ చెబుతోంది. అలాగే హిట్ 3 షూటింగ్ సమయంలో దిగిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది నిధి. మొత్తానికి ఈ బ్యూటీ ఇప్పుడు నెట్టింట తెగ కనిపిస్తోంది.
హిట్ -3 మూవీ టీమ్ తో నిధి సింగ్..
View this post on Instagram
వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని హిట్-3 సినిమాను నిర్మించారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చారు. కాగా మే01న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది.
గ్లామరస్ లుక్ లో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.