అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు.. ఇక చిప్ప కూడే గతి ??
ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం, యూట్యూబ్‌లో ఎక్కించేయడం, వ్యూస్ కోసం అడ్డమైన థంబ్‌నైల్స్ పెట్టడం.. చివరకు కేసులు పెడితే.. సారీ చెప్పి తప్పించుకోవడం..ఇదీ మన తెలుగురాష్ట్రాల్లో జరుగుతున్న తంతు. ఇదే తంతును గత కొన్ని రోజులుగా రిపీట్ చేస్తూ వస్తున్న ఫేమస్ యూట్యూబర్ అన్వేష్.. ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు.
గత రెండు నెలలుగా బెట్టింగ్‌యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేసిన ఈయన అదే ఫ్లోలో మరి కొందరిపై ఆరోపణలు చేస్తూ.. ఇప్పుడు అదే ఆరోపణల తీరు కారణంగా చిక్కుల్లో పడ్డాడు. ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు విసురుతూ ఓ వీడియో చేశాడు. చివరకు కేసుల్లోఇరుక్కున్నాడు. ఇంతకూ అన్వేష్ చేసిన ఆరోపణలు నిరాధారమా..? ప్రపంచయాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యవసానమా.? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అన్వేష్! ఆధారాలతో సహా అన్నీ వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం.. తీరా వీడియో అంతా నోటి మాటలు.. పచ్చి బూతులు.. తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండకపోవడం. జస్ట్ వ్యూస్ కోసమే తన నోటికి పనిచెబుతున్నట్టు కనిపించడం. ఇదే తీరు.. ఇప్పుడిదేతీరు.. అన్వేష్ మెడకు ఉచ్చు బిగే వరకు తెచ్చింది. తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్‌యాప్స్‌ను ప్రమోట్ చేసిందని అర్థం వచ్చేలా.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ.. రీసెంట్‌గా అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌లో మాజీ సీఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని.. మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్‌కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన అలిగేషన్స్.. చాలా దూరం వెళ్లాయి. ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కూ కోపం తెప్పించాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొన్నే రిలీజ్.. అప్పుడే స్ట్రీమింగ్ డేట్ !! OTTలోకి ఓదెల 2
నన్ను టెర్రరిస్ట్ అంటావా ?? అన్వేష్‌కి ఇచ్చిపడేసిన సోహైల్
కోర్టుతో ఆటలాడితే.. చిప్పకూడు తినాల్సిందే..
షాకింగ్ న్యూస్! కోహ్లీ బయోపిక్‌లో చరణ్ కాదు శింబు నటిస్తున్నాడు?
ఛీ వీడు మనిషి కాదు! సెల్ఫీ పేరుతో హీరోయిన్‌ను అసభ్యంగా తాకిన ఫ్యాన్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

