కోర్టుతో ఆటలాడితే.. చిప్పకూడు తినాల్సిందే..
ఈ మధ్యనే కాదు.. ఎప్పటి నుంచో కోర్టు రావడానికి కొందరు సెలబ్రిటీలు బద్దకిస్తారనే కామెంట్ ఉంది. షూటింగ్ ఉందనో.. వేరే పని ఉందనో.. వాయిదాలు కోరుతూ కోర్టు టైంను వృథా చేయడమూ జరుగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ ఏజ్ లెస్ క్వీన్ మలైకా కూడా.. ఇదే చేసింది. కోర్టుకు బంక్ కొట్టి చిక్కుల్లో పడింది. ఇక అసలు విషయం ఏంటంటే.. 2012లో ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో గొడవకు జరిగింది.
ఇందులో దేవర విలన్, ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్, అమృత అరోరా భర్త షకీల్ లడక్, అతని స్నేహితుడు బిలాల్ అమ్రోహి ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో సాక్షిగా హాజరు కావాలని కోర్టు నటి మలైకా అరోరాను కోరింది. కానీ అరోరా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ… విచారణకు డుమ్మా కొడుతోంది. గతంలో ఈమెపై సీరియస్ అయిన ముంబాయ్ హైకోర్టు ఏప్రిల్ 29 లోపు విచారణకు హాజరు కావలని లేదంటే బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంటూ చెప్పింది. కానీ ఈమె కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టింది. ఈ క్రమంలోనే ముంబై కోర్టు మలైకాకు చివరి అవకాశం ఇచ్చింది. జులై 9 లోపు తదుపరి విచారణకు హాజరు కాకపోతే ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంటూ హెచ్చరించింది. అంతేకాదు కేసును నీరు గార్చే ప్రయత్నంలో భాగంగానే సాక్షిగా ఉన్న ఈమె… కోర్టుకు డుమ్మా కొడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే కోర్టు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోర్టుతో ఆటలాడితే చిప్ప కూడు తినాల్సిందే అనే కామెంట్స్ ఈమెకు ఉద్దేశ్యించి సోషల్ మీడియాలో వస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాకింగ్ న్యూస్! కోహ్లీ బయోపిక్‌లో చరణ్ కాదు శింబు నటిస్తున్నాడు?
ఛీ వీడు మనిషి కాదు! సెల్ఫీ పేరుతో హీరోయిన్‌ను అసభ్యంగా తాకిన ఫ్యాన్
పాపం !! కోహ్లీ ప్రేమకు భారీ మూల్యమే చెల్లించిన అనుష్క
మంచి మనసు చాటుకున్న విష్ణు.. మధుసూదన్ కుటుంబాన్ని దత్తత తీసుకున్న హీరో!
నోరు జారి జింక మాంసం తిన్నానని చెప్పిన నటి.. దెబ్బకు షాకిచ్చిన పోలీసులు
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

