AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్ న్యూస్! కోహ్లీ బయోపిక్‌లో చరణ్‌ కాదు శింబు నటిస్తున్నాడు?

షాకింగ్ న్యూస్! కోహ్లీ బయోపిక్‌లో చరణ్‌ కాదు శింబు నటిస్తున్నాడు?

Phani CH

|

Updated on: May 05, 2025 | 7:31 PM

క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ సాధించిన విజయాలు, రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం కోహ్లీ కోసమే క్రికెట్ మ్యాచ్ లు చూసే వారు చాలామంది ఉన్నారు. కేవలం ఆటతోనే కాదు తన ప్రవర్తన, క్రమ శిక్షణ తోనూ ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్నాడు కోహ్లీ. ఇక విరాట్ కోహ్లీ పర్సనల్ లైఫ్ లోనూ ఎన్నో ఆసక్తికర మలుపులున్నాయి.

ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ బయోపిక్ వస్తే చూడాలని కోరుకుంటున్నారు. గతంలో దీనికి సంబంధించి పలు ఊహాగానాలు వినిపించాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తాడని ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్‌ కాకుండా మరో హీరో పేరు వినిపిస్తోంది. ఎస్ ! కోలీవుడ్ నటుడు శింబు విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటిస్తాడని నెట్టింట ఓ టాక్ చక్కర్లు కొడుతోంది. ఇలా కోహ్లీ బయోపిక్ లో ఉన్నట్లుండి శింబు పేరు రావడానికి ఒక కారణముంది. విరాట్ కోహ్లీ ఇటీవల RCB చాట్ షోలో తనకు ఇష్టమైన పాట గురించి మాట్లాడాడు. తాను ప్రస్తుతం ఏ పాటను పదే పదే వింటున్నానో వెల్లడించాడు కోహ్లీ. తమిళ సినిమా ‘పట్టు తల’ లోని ‘నీ సింగం ధన్..’ పాటను రిపీట్ మోడ్‌లో వింటున్నానంటూ కోహ్లీ చెప్పాడు. ఇది శింబు నటించిన సినిమాలోని పాట. ‘నీ సింగం ధన్’ అంటే ‘నువ్వు నిజంగా సింహంవి’ అర్థం. అయితే ఈ పాట గురించి విరాట్ కోహ్లీ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వీడియోను శింబు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దానికి ‘విరాట్ కోహ్లీ రియల్ అండ్ ట్రూ లయన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ క్రమంలోనే కోహ్లీ బయోపిక్‌లో శింబు నటిస్తుంటే బాగుంటుందనే టాక్ ఇప్పుడు కోలీవుడ్‌లో బయటికి వచ్చింది. అది కాస్తా వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఛీ వీడు మనిషి కాదు! సెల్ఫీ పేరుతో హీరోయిన్‌ను అసభ్యంగా తాకిన ఫ్యాన్

పాపం !! కోహ్లీ ప్రేమకు భారీ మూల్యమే చెల్లించిన అనుష్క

మంచి మనసు చాటుకున్న విష్ణు.. మధుసూదన్ కుటుంబాన్ని దత్తత తీసుకున్న హీరో!

నోరు జారి జింక మాంసం తిన్నానని చెప్పిన నటి.. దెబ్బకు షాకిచ్చిన పోలీసులు

అంజనమ్మ చేతి ఆవకాయ.. ఆహా.. అమోఘం..

Published on: May 05, 2025 07:08 PM