అంజనమ్మ చేతి ఆవకాయ.. ఆహా.. అమోఘం..
మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ గతేడాది వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. తన కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్‌ను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇన్ స్టంట్ మిక్స్ లు రెడీ చేసి ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారీ అత్తా కోడళ్లు. దూర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని మిస్ అవకూడదన్న ఆలోచనతోనే ఈ అత్తమ్మాస్ కిచెన్ కు పురుడుపోసిందన్నారు సురేఖ- ఉపాసన.
ఇందులో భాగంగా అప్పటికప్పుడు పెద్దగా శ్రమ పడకుండా ఈజీగా ఇంటి భోజనం తయారు చేసుకునేలా ఈ ఇన్‌స్టంట్ మిక్స్‌లు రెడీ చేసి అమ్ముతున్నామని చెప్పారు. ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఎలాంటి కృత్రిమ ప్రిజర్వేటివ్స్ వాడమంటున్నారు. ప్రస్తుతం వీరు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్.. ఇలా పలురకాల ఉత్పత్తులను వీరు విక్రయిస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి మరో స్పెషల్ వంటకం చేరింది. అదే సమ్మర్ స్పెషల్ అవకాయ పచ్చడి. ఈ మేరకు అత్తమ్మాస్ కిచెన్‌లోకి ఆవకాయ చేరుస్తున్నట్లు, ఓ వీడియోను పోస్ట్ చేసింది ఉపాసన. అందులో ఉపాసనకు బొట్టు పెట్టిన సురేఖ.. ఆవకాయ పచ్చడి జాడిని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి, ఆవకాయ పచ్చడి ముక్కలు కొట్టడం నుంచి పచ్చడి పెట్టే ప్రాసెస్ ఈ వీడియోలో చూపించారు. ‘అందరికీ వేసవి సీజన్ పచ్చళ్లు అందుబాటులో ఉంటాయి. ఆర్డర్ చేసుకోండి’ అని అందులో కోరింది. ‘ఆవకాయ.. కేవలం పచ్చడి మాత్రమే కాదు.. మన సంప్రదాయం. ఈ సీజన్ లో ఆవకాయ పచ్చడితో మీ ముందుకు వస్తున్నాం. ఆహారం అంటే కేవలం పౌష్టికాహారం మాత్రమే కాదు. మన సంస్కృతిని వారసత్వాన్ని కాపాడుకునే మార్గం’ అని తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది ఉపాసన.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పశువుల పాకలో వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా షాకింగ్ సీన్..!
క్షణ క్షణం.. భయం భయం.. అసలు అక్కడ ఏం జరుగుతోంది ??
తరుచూ తలనొప్పి పరేషాన్ చేస్తోందా ?? ఈ పని చేయండి ఇట్టే పోతుంది..!
ఎండాకాలమని మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారా ??
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. అతిగా తింటున్నారా ?? అయితే మీకు
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

