చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. అతిగా తింటున్నారా ?? అయితే మీకు
ముక్క లేనిది ముద్ద దిగడం లేదా? కోడి కూర లేనిదే భోజనం రుచించడం లేదా? అయితే మీకో బ్యాడ్ న్యూస్.. చికెన్ అతిగా తింటే క్యాన్సర్ ముప్పు పొంచి ఉందట. లేటెస్ట్ గా నిర్వహించిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చికెన్ అతిగా తింటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ అంటే పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని తేలింది.
చికెన్ లో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువ. విటమిన్ బి12, కొలైన్ పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లల్లో నరాల వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఇది తింటే బలం వస్తుందని డాక్టర్లు చెబుతారు. పైగా రెడ్ మీట్‌తో పోలిస్తే హెల్త్ రిస్క్‌లు తక్కువ. చికెన్ తో ఇన్ని ప్రయోజనాలున్నా.. అదే పనిగా డైలీ తింటే మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు. వారానికి 300 గ్రాములకు మించి చికెన్ తింటే పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదముందట. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ ముప్పు మహిళల్లో కన్నా పురుషుల్లోనే ఎక్కువగా ఉండే అవకాశముందట. పలు రకాల పౌల్ట్రీ ఉత్పత్తులు కోడి, టర్కీ, బాతు లాంటి మాంసాలు తినడం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. పరిశోధకులు దాదాపు 19 సంవత్సరాలు 4వేల మందికి పైగా వ్యక్తులపై రీసెర్చ్ చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. పాంక్రియాటిక్ సమస్యలు, లివర్ జబ్బులు, కడుపు నొప్పి, రెక్టల్ క్యాన్సర్ లాంటి వాటినీ గుర్తించారు. వారానికి 2 లేదా 3 రోజులు మాత్రమే చికెన్ తినాలని అధ్యయనకారులు సూచించారు. వారానికి 100 గ్రాముల వరకు తింటే ఎలాంటి ముప్పు ఉండదట. క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా తగ్గుతుందని నిపుణులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరదలితో లేచిపోయిన ముగ్గురు పిల్లల వదిన
విమానానికి హ్యాండ్ పంప్‌తో గాలి కొట్టిన పైలట్
ప్రాసెస్ చేసిన ఫుడ్‌తో అకాల మరణాలు.. అధ్యయనం వెల్లడి
టైటానిక్ సర్వైవర్ రాసిన లేఖకు వేలంలో కళ్లు చెదిరే ధర.. ఎంతంటే ??
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

