మరదలితో లేచిపోయిన ముగ్గురు పిల్లల వదిన
భారతీయ వివాహ వ్యవస్థ పాశ్చాత్య సంస్కృతిని సంతరించుకుంటుందనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ప్రపంచంలో ఎక్కడైనా ఓ ఆడ, ఓ మగ పెళ్లి చేసుకోవడం చూశాం గానీ, ఇద్దరు ఆడవారు పెళ్లి చేసుకోవడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటుంది. సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ బలంగా కలిగిన భారత్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.
బీహార్‌లోని దర్భంగ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి తన మరదలితో ఆ సంబంధం పెట్టుకొని ఆమెను రహస్యంగా పెండ్లాడి పరారైంది. ఈ నెల 26న ఆమె, ఆమె భర్త, మైనర్ మరదలు రాజస్థాన్ నుంచి ఆమె స్వగ్రామం కుషెష్వర్‌స్థాన్‌కు తిరిగి వచ్చినప్పుడు ఆమెను, ఆమె భర్తను బహెరి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని కోర్ట్ ఆదేశించింది. మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె కుటుంబానికి అప్పజెప్పారు. క్రితి దేవి అనే మహిళకు 11 ఏండ్ల క్రితం కృష్ణ మాంఝీతో పెంళ్లైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. క్రితి దేవి మైనర్ బాలిక పెద్ద అక్కకు వదిన అవుతుంది. క్రితి దేవి రెండేండ్లుగా తమ ఇద్దరి కుటుంబాలకు తెలియకుండా మైనర్ బాలికతో ప్రేమాయణం సాగిస్తున్నది. క్రితి దేవి వదిలేస్తానని తరచూ తన భర్తను బెదిరించేది. అలాగే తన మైనర్ ప్రియురాలితో సంబంధాన్ని వదిలి పెట్టనని చెప్పేది. అయితే ఈ నెల 6న మైనర్ బాలిక తండ్రి తన కూతురు అపహరణకు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా క్రితి దేవి, మైనర్ రహస్యంగా పెండ్లి చేసుకొని రాజస్థాన్‌కు పారిపోయారని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానానికి హ్యాండ్ పంప్‌తో గాలి కొట్టిన పైలట్
ప్రాసెస్ చేసిన ఫుడ్‌తో అకాల మరణాలు.. అధ్యయనం వెల్లడి
టైటానిక్ సర్వైవర్ రాసిన లేఖకు వేలంలో కళ్లు చెదిరే ధర.. ఎంతంటే ??
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

