ప్రాసెస్ చేసిన ఫుడ్‌తో అకాల మరణాలు.. అధ్యయనం వెల్లడి
రెడీ టు ఈట్.. ప్రస్తుతకాలంలో వీటి వినియోగం బాగా ఎక్కువైపోయింది. సమయాభావంతో ఉరుకుల పరుగుల జీవితాలు కారణంగా వండుకు తినే పరిస్థితి లేదు. దీంతో చాలామంది ప్రాసెస్డ్ ఫుడ్‌కి అలవాటు పడుతున్నారు. అయితే ఇది చాలా డేంజర్ అని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మీరు వేడి చేసుకుని తినే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త!
ఇలాంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం, అకాల మరణాల ముప్పును గణనీయంగా పెంచుతుందని ఓ ప్రపంచ అధ్యయనంలో తేలింది. అధికంగా సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెర ఉండే ఈ ఆహారాలు గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, డిప్రెషన్ సహా 32 రకాల ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉన్నాయని గత అధ్యయనాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, కొలంబియా, మెక్సికో, యూకే, యూఎస్ వంటి ఎనిమిది దేశాల ఆహారపు అలవాట్లు, మరణాల గణాంకాలను విశ్లేషించి ఈ కొత్త అధ్యయనాన్ని రూపొందించారు. ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్’లో ప్రచురితమైన ఈ అధ్యయన ఫలితాల ప్రకారం, వ్యక్తులు తీసుకునే మొత్తం కేలరీలలో UPFల వాటా పెరిగే కొద్దీ, వాటి వల్ల సంభవించే అకాల మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని స్పష్టమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైటానిక్ సర్వైవర్ రాసిన లేఖకు వేలంలో కళ్లు చెదిరే ధర.. ఎంతంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

