ఎండాకాలమని మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారా ??
వేసవికాలం వచ్చేసింది. సొంత ద్విచక్రవాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. దీంతో చాలామంది మైట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువశాతం మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తుండడంతో ఓ పక్క రద్దీ ఏర్పడుతుండగా సంస్థకు భారీ ఆదాయం సమకూరుతోంది. ఎండల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోరైళ్లు కిటకిటలాడుతున్నాయి.
ప్రతీ బోగీలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్లపై ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలామంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఏసీ సౌకర్యం అంతగా లేకపోవడంతో మెట్రోలో చల్లటి ప్రయాణానికి నగరవాసులు ప్రాధాన్యమిస్తున్నారు. 50 రూపాయల వరకు టికెట్ చార్జీతో ఏసీలో రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉండడంతో చాలామంది మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10.30 వరకు ఎల్‌బీనగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం కారిడార్లలో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. జేబీఎస్ – ఎంజీబీఎస్ కారిడార్‌లో కూడా సాధారణ రోజుల్లో కంటే రెండింతల మంది అధికంగా ప్రయాణిస్తున్నట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. నాలుగు రోజులుగా 5 లక్షల మంది మార్కు దగ్గరగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంటోందని మెట్రో సిబ్బంది తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. అతిగా తింటున్నారా ?? అయితే మీకు
మరదలితో లేచిపోయిన ముగ్గురు పిల్లల వదిన
విమానానికి హ్యాండ్ పంప్‌తో గాలి కొట్టిన పైలట్
ప్రాసెస్ చేసిన ఫుడ్‌తో అకాల మరణాలు.. అధ్యయనం వెల్లడి
టైటానిక్ సర్వైవర్ రాసిన లేఖకు వేలంలో కళ్లు చెదిరే ధర.. ఎంతంటే ??
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

