పశువుల పాకలో వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా షాకింగ్ సీన్..!
అనకాపల్లి జిల్లాలో భారీ గిరినాగు బుసలు కొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 అడుగుల కింగ్ కోబ్రా హడలెత్తించింది. మాడుగుల శివారు లో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. అర్జునరావు కల్లాలోని పశువుల పాకలో ఏవో శబ్దాలు వినిపించాయి. పైకి తొంగి చూసేసరికి.. కమ్మల్లో భారీ గిరినాగు కనిపించింది. అంతే భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు రైతు.
విషయం స్థానికులకు చెప్పగా వారు అటవీ శాఖ అధికారులు, స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ వెంకటేష్.. పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఆపాము పాక లోపల నుంచి వేగంగా కొమ్మలపై నుంచి చెట్టు పైకి వెళ్ళిపోయింది. భారీ గిరినాగు వేగంగా పాకుతూ చెట్టుపైకి వెళ్తున్న దృశ్యం చూసి అక్కడున్నవారంతా ఒకింత భయానికి గురయ్యారు. గిరినాకు స్నేక్ క్యాచర్‌కు చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టింది. ఆ రాచనాగును బంధించేందుకు రెండు గంటలు శ్రమించాల్సి వచ్చింది. అయినా కోబ్రా ఆటలు సాగనివ్వలేదు స్నేక్ క్యాచర్. చివరకు వెంకటేష్‌కి పట్టుబడక తప్పలేదు ఆ గిరినాగుకి. ఎంతో నేర్పుతో కింగ్ కోబ్రాను బంధించిన వెంకటేష్ దానిని సురక్షితంగా తీసుకెళ్లి అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్షణ క్షణం.. భయం భయం.. అసలు అక్కడ ఏం జరుగుతోంది ??
తరుచూ తలనొప్పి పరేషాన్ చేస్తోందా ?? ఈ పని చేయండి ఇట్టే పోతుంది..!
ఎండాకాలమని మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారా ??
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. అతిగా తింటున్నారా ?? అయితే మీకు
మరదలితో లేచిపోయిన ముగ్గురు పిల్లల వదిన
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!

