నోరు జారి జింక మాంసం తిన్నానని చెప్పిన నటి.. దెబ్బకు షాకిచ్చిన పోలీసులు
కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన 'లాపతా లేడీస్' చిత్రంతో నటి ఛాయా కదమ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఛాయా కదమ్ రక్షిత జాబితాలోని వన్యప్రాణుల మాంసాన్ని తిన్నారన్న ఆరోపణలపై మహారాష్ట్ర అటవీ శాఖ విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలు నిరూపితమైతే ఆమె చట్టపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
ముంబైకి చెందిన ప్లాంట్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విచారణ ప్రారంభమైంది. ఛాయా కదమ్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆధారం చేసుకుని థానే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్‌కు పాస్ ఫిర్యాదు చేసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం రక్షిత జాబితాలో ఉన్న కణితి, కుందేలు, అడవి పంది, ఉడుము, ముళ్ల పంది వంటి జంతువుల మాంసాన్ని తాను రుచి చూసినట్లు కదమ్ స్వయంగా చెప్పారని ఎన్జీవో తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి, నటితో పాటు ఈ వేటలో, మాంసం వినియోగంలో ప్రమేయం ఉన్న ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్జీవో కోరింది. ఎన్జీవో ఫిర్యాదును స్వీకరించిన మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఛాయా కదమ్‌కు సమన్లు జారీ చేశారు. ఈ ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేసేందుకు, వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కేవలం నటిని విచారించడమే కాకుండా, మాంసాన్ని సమకూర్చిన వేటగాళ్లు లేదా ఇందులో పాలుపంచుకున్న ఇతర వ్యక్తుల వివరాలను సేకరించడంపైనా ఈ బృందం దృష్టి సారించనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

