వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలోకి ఏడు అడుగుల నాగుపాము ప్రవేశించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆలయంలో ఉన్న నాగుపామును స్నేక్ క్యాచర్ జగదీష్ సురక్షితంగా పట్టుకొని జనసంచారం లేని ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో భక్తులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.