మంచి మనసు చాటుకున్న విష్ణు.. మధుసూదన్ కుటుంబాన్ని దత్తత తీసుకున్న హీరో!
ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు ఏపీ వాసులు కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధు సూధన్ అనే వ్యక్తి విహార యాత్రకు కశ్మీర్ వెళ్లి ఉగ్రదాడిలో కన్ను మూశాడు. దీంతో అతని కుటుంబం ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
ఇప్పటికే మధుసూదన్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకులు కలిసి పరామర్శించారు. మధుసూదన్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇక జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. తాజాగా మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు మధు సూదన్ కుటుంబాన్ని కలిశారు. వారికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చాడు. దాంతో పాటే తన మంచి మనసును చాటుకున్నాడు. మే 02న నెల్లూరు జిల్లా కావలి వెళ్లిన మంచు విష్ణు.. మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మొదట మధుసూదన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించాడు విష్ణు. ఆ తర్వాత మధుసూదన్ రావ్ సతీమణి కామాక్షి, పిల్లలకు ధైర్యం చెప్పారు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ.. మధు సూదన్ పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని, వారిని దత్తత తీసుకుని చదువుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నోరు జారి జింక మాంసం తిన్నానని చెప్పిన నటి.. దెబ్బకు షాకిచ్చిన పోలీసులు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

