దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20% పెంచాలని నిర్ణయించగా, వలస కార్మికులకు ఉచితంగా 5 కేజీల గ్యాస్ సిలిండర్లు అందించనుంది. రెస్టారెంట్లు, హోటళ్లకు నిరంతర సరఫరా, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది.