పచ్చి ఉల్లిలో మెచ్చే గుణాలు.. క్యాన్సర్ సహా ఎన్నో రోగాలకు ఛూమంత్రం!
16 March 2026
TV9 Telugu
TV9 Telugu
దాదాపు అన్ని వంటగదుల్లో ఉల్లి తప్పక కనిపిస్తుంది. వంటల్లో ఉల్లి వాడకం వల్ల వంటకాలకు ప్రత్యేక రుచి వస్తుంది. పకోడి, సలాడ్స్, సాండ్‌విచ్ వంటి వాటిల్లో కూడా ఉల్లిపాయను ఎక్కువగా వాడుతుంటాం
TV9 Telugu
వంటలతో పాటు వివిధ రకాల చిరుతిండ్లతో నేరుగా తీసుకుంటాం. ముఖ్యంగా వేసవి కాలంలో పచ్చి ఉల్లిపాయలను నేరుగా తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనం చేస్తుందని పెద్దలు చెబుతుంటారు
TV9 Telugu
ఉల్లి వల్ల ఆహారాలకు రుచితోపాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పచ్చిఉల్లిపాయలల్లో ఉండే పోషకాలు అందుకు కారణం. ఉల్లిపాయలో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది
TV9 Telugu
శరీరంలో వాపులను, అలర్జీ లక్షణాలను కూడా ఇది తగ్గిస్తుంది. ఇవి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది
TV9 Telugu
ఉల్లిలో విటమిన్ సి, బి విటమిన్లు, పొటాషియం వంటి పోషకాలు దండిగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఉల్లి తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి
TV9 Telugu
డయాబెటిస్ రోగులకు కూడా ఉల్లి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ తో బాధపడే వారు ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు
TV9 Telugu
ఉల్లిలోని ప్రీబయోటిక్స్, ఫైబర్ పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు పెరుగుదలకు, ఎముకలను ధృడంగా చేయడంలో ఉపయోగపడుతుంది. వయసు పైబడిన వారు వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి
TV9 Telugu
పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా తక్కువట