AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Preeti Jhangiani: పవన్ కల్యాణ్ తమ్ముడు హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు బిజినెస్ ఉమన్.. ఎలా మారిపోయిందో చూశారా?

సినిమాల్లో ఫేడవుల్ అయిపోయిన హీరోయిన్లలో చాలా మంది తమ భర్త, పిల్లలతో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరికొందరు సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకొందరు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది.

Preeti Jhangiani: పవన్ కల్యాణ్ తమ్ముడు హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు బిజినెస్ ఉమన్.. ఎలా మారిపోయిందో చూశారా?
Preeti Jhangiani
Basha Shek
|

Updated on: May 06, 2025 | 4:45 PM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ ప్రారంభంలో నటించిన సూపర్ హిట్ సినిమాల్లో తమ్ముడు ఒకటి. 1999లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అప్పటి యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు కూడా టీవీలో తమ్ముడు సినిమా వస్తే ఎగబడి చూసే వారు చాలా మందే ఉన్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. స్టైల్ అండ్ ట్రెండీ గర్ల్ లవ్లీ పాత్రలో అదితి గోయెత్రికర నటిస్తే, జానకిగా పద్దతైన అమ్మాయి పాత్రలో ప్రీతి జింగానియా యూత్ ను ఇట్టే ఆకట్టుకుంది. ఇక సినిమా చివరిలో అయితే తన నటనతో ఆడియెన్స్ కళ్లల్లో నీళ్లు తెప్పిచింది. ప్రీతిది ముంబై. తమ్ముడు సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కా కన్నడ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, రాజస్థానీ సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. నరసింహ నాయుడులో బాలకృష్ణతో, అధిపతి మూవీలో మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్, ఆనందమానందమాయే సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. ఎన్టీఆర్ నటించిన యమదొంగలో ఓ స్పెషల్ సాంగ్ లో తళుక్కుమంది. తెలుగులో ఇదే ప్రీతికి చివరి సినిమా. ఆ తర్వాత ఇతర భాషా సినిమాల్లోనే ఎక్కువగా కనిపించింది.

ఇవి కూడా చదవండి

కాగా సినిమాల్లో ఉండగానే 2008లో నటుడు, మోడల్ పర్వీన్ దబాస్‌ని పెళ్లి చేసుకుంది ప్రీతి. ప్రస్తుతం వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పర్వీన్ కూడా హిందీలో ‘మాన్‌సూన్ వెడ్డింగ్’, ‘ఖోస్లా కా ఘోస్లా’, ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్ 2’ తదితర సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు.

కరణం మల్లీశ్వరితో ప్రీతి జింగానియా..

సినిమాలకు దూరంగా ఉన్న ప్రీతి భర్తతో కలిసి ‘స్వెన్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే కంపెనీని రన్ చేస్తోంది. . ఈ కంపెనీ ఫిల్మ్ ప్రొడక్షన్, ఈవెంట్ ప్రమోషన్, స్పోర్ట్స్ ప్రమోషన్స్ లాంటి ఫీల్డ్స్‌లో వర్క్ చేస్తోంది. అంతేకాదు ప్రీతి ‘ప్రో పంజా లీగ్’ అనే ఆర్మ్ రెజ్లింగ్ టోర్నమెంట్‌కు కో-ఫౌండర్‌గా కూడా ఉంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మరి మన టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తన లేటెస్ట్ ఫొటోస్ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.