Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది సూపర్ స్టార్ కృష్ణ రేంజ్ అంటే..!! ఇదేం టైటిల్.. ఇలా ఉంది..? అన్నారు.. కానీ విడుదలైన తర్వాత థియేటర్స్ దద్దరిల్లిపోయాయి

సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు.. తెలుగు సినిమా చరిత్ర పై చెరగని సంతకం చేశారు కృష్ణ.. ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఏలారు కృష్ణ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి నటులు ఉన్నా కూడా.. తన నటనతో సినిమాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు కృష్ణ. దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి ఎవ్వరూ అందుకోలేని ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు సూపర్ స్టార్.

అది సూపర్ స్టార్ కృష్ణ రేంజ్ అంటే..!! ఇదేం టైటిల్.. ఇలా ఉంది..? అన్నారు.. కానీ విడుదలైన తర్వాత థియేటర్స్ దద్దరిల్లిపోయాయి
Krishna
Rajeev Rayala
|

Updated on: May 06, 2025 | 4:20 PM

Share

తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న నటుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. తెలుగు సినిమాల్లో ఆయన ఓ శిఖరం.. ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేశారు కృష్ణ. బుర్రిపాలే అనే గ్రామం నుంచి వచ్చిన కృష్ణ రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నారు. నాగేశ్వరావు క్రేజ్ చూసి తాను కూడా ఎలాగైనా హీరో కావాలని అని కసితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కృష్ణ. దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించారు. కృష్ణ ఒకే ఏడాదిలో 18 సినిమాల్లో నటించారు. ఇది ఆయన కెరీర్‌లోని ఒక రికార్డు. 1972లో ఆయన 18 సినిమాలు విడుదలయ్యాయి. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న కృష్ణ.. అనేక ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.

కృష్ణ చేయని పాత్ర లేదు అని అతిశయోక్తి కాదు.. ఈనాడు, సింహాసనం, మోసగాళ్లకు మోసగాడు, అమ్మదొంగా ఇలా ఎన్నో డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేసి మెప్పించారు. ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ కృష్ణ తన నటనతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అప్పటిలో కృష్ణ సినిమా వస్తుందంటే చాలు జనాలు ఎడ్లబండ్లు, ట్రాకర్స్ వేసుకొని మరీ వెళ్లేవారు. అయితే కృష్ణ అభిమానులు ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారా అలా చూపించిన దర్శకుల్లో ఎస్వీ కృష్ణ రెడ్డి ఒకరు. సూపసర్ స్టార్ కృష్ణతో ఆయన మంచి విజయాలను అందుకున్నారు.

అయితే కృష్ణ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ నెంబర్ వన్ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో కృష్ణ చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు. 25 ఏళ్ల కుర్రాడిలా కనిపించారు కృష్ణ. అంతే కాదు ఈ సినిమాలో ఆయన అర్జునుడు, ఛత్రపతి శివాజీ, చార్లీ చాప్లిన్, రోమన్ యోధుడు, రాజు, నీగ్రో గెటప్స్ లో కనిపించారు. అయితే సినిమాకు నెంబర్ వన్ అని టైటిల్ పెట్టిన సమయంలో చాలా మంది కృష్ణ నెంబర్ వన్ హీరోనా..? ఆ టైటిల్ పెట్టారు అంటూ విమర్శలు కురిపించారట. తీరా సినిమా విడుదలైన తర్వాత సంచలన విజయాన్ని అందుకుంది. ఎక్కడ చూసిన జనాలు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దాంతో విమర్శించినా వారంతా నోరు మూసుకున్నారు. ఇక ఈ సినిమాలో కృష్ణ సరసన సౌందర్య నటించి మెప్పించారు. ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ అనే చెప్పాలి .. పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి