Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అరెరే ఏముందిరా? ఈ 900 కోట్ల సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తు పట్టారా? త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ!

ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఓ సినిమాలో నటించిన ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గుర్తు పట్టలేనంత అందంగా మారిపోయింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు సైతం ముక్కన వేలేసుకుంటున్నారు? అప్పుడు ఎంతో అమాయకంగా, క్యూట్ గా కనిపించిన పాప ఇప్పుడు ఇంత అందంగా మారిపోయిందేంటంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Tollywood: అరెరే ఏముందిరా? ఈ 900 కోట్ల సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తు పట్టారా? త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ!
Child Actress
Follow us
Basha Shek

|

Updated on: May 06, 2025 | 1:33 PM

పై ఫోటోలో ఉన్న దెవరో గుర్తు పట్టారా? సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవారు అయితే ఇట్టే గుర్తు పట్టవచ్చు. మిగతా వారు అయితే అంత త్వరగా గుర్తు పట్టలేరు. ఈ అమ్మాయి మొన్నటివరకు ఒక ఛైల్డ్ ఆర్టిస్ట్ వరకు. అలాగనీ పెద్దగా సినిమాలు చేయలేదు. నటించింది కేవలం ఒకే ఒక్క సినిమాలోనే. కానీ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. తన అమాయకమైన నటన, క్యూట్ నెస్, ఎక్స్ ప్రెషన్స్ తో సినిమా ఆడియెన్స్ కు బాగా చేరువైంది. కొన్ని సన్నివేశాల్లో అయితే ఏం మాట్లాడకుండానే తన హావభావాలతో అందరితో కన్నీళ్లు పెట్టించింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఈ క్యూటీ మరే మూవీలోనూ నటించలేదు. చదువుకు ప్రాధాన్యమిచ్చి ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. సినిమాలకు దూరంగా ఉన్నఈ ముద్దుగుమ్మ ఇటీవల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తోంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. అలా తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. అప్పుడు సినిమాలో కనిపించిన ఆ చిన్నపాపేనా? ఈ అందాల ముద్దుగుమ్మా’ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ ఎవరో మీరైనా గుర్తు పట్టారా? తను మరెవరో కాదు సల్మాన్‌ ఖాన్ భజరంగీ భాయ్ జాన్ సినిమాలో నటించిన హర్షాలీ మల్హోత్రా.. అదేనండి మున్నీ.

భజరంగీ భాయ్ జాన్ సినిమాకు ముందు కొన్ని సీరియల్స లో నటించింది హర్షాలీ. 2014లో కుబూల్ హై, లౌట్ ఆవో తృషా తదితర ధారావాహికల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఇక ఏడేళ్ల ప్రాయంలో భజ్రంగీ భాయ్‌జాన్‌ మూవీలో యాక్ట్ చేసింది. ఆ సినిమాలో అమాయకంగా ఉన్న మున్నీ ఇప్పుడు టీనేజ్‌లో తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే హర్షాలి మల్హోత్రాకు ఇన్ స్టా గ్రామ్ లో సుమారు 3.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం చదువుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే సినిమాల్లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

హర్షాలీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

గ్లామరస్ డ్రెస్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్.. లైవ్ వీడియో
ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్.. లైవ్ వీడియో
ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ
ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ