ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగాల్లో శుభవార్తలు
Horoscope Today (August 12, 2026): బుధవారం 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. మేష రాశి వారికి కుటుంబపరంగా శుభవార్తలు, ఆర్థిక లావాదేవీల్లో అనుకూలత కనిపించగా, వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. మరి మిగిలిన రాశుల వారికి ఈ బుధవారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.

దిన ఫలాలు (ఆగస్టు 12, 2026): మేష రాశి వారికి కుటుంబపరంగా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గి, లాభాల బాటపడతాయి. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరి స్థితి ఉంటుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. కుటుంబపరంగా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండకపోవచ్చు. వృథా ఖర్చులు మాత్రం బాగా తగ్గించుకోవాలి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో పని ఒత్తిడి బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గి, లాభాల బాటపడతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయ గల స్థితిలో ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పరిచయస్థుల ద్వారా ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. కొత్త ఆదాయ ప్రయత్నాలకు కాలం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారా లను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కొద్దిగా అపార్థాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కొత్త ఉద్యోగా వకాశాలు అంది వస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల పని భారం వల్ల ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రతిఫలానికి లోటుండదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగపరంగా ఇతర కంపెనీల నుంచి ఆపర్లు, ఆహ్వానాలు అందుకుంటారు. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు నిలక డగా సాగిపోతాయి. శరీరానికి విశ్రాంతి తగ్గుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభి స్తాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపడతారు. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. మిత్రుల నుంచి నూతన వస్తు లాభాలకు అవ కాశం ఉంది. రుణ సమస్యలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి జీవితంలో మరింత పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో కొత్త మార్పులు చేపట్టి లాభాలు పొందు తారు. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. సమాజంలో రాజపూజ్యాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశముంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగానేఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం బాగానే ఉంటుంది. ఆదాయం పెంచుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా పనులు, ప్రయత్నాలు వాయిదా పడతాయి. కొందరు బంధు మిత్రులతో అపార్థాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి తగ్గి ఊరట లభిస్తుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనలతో బాగా లబ్ధి పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. వ్యాపారాలు ప్రోత్సాకరంగా పురో గమిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. గట్టి పట్టుదలతో కొన్ని లాభదాయక వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సోదరులతో వివాదాలుచాలా వరకు సద్దు మణుగుతాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. గట్టి పట్టుదలతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు. జీవిత భాగస్వామికి స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గు ముఖం పడతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానేఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో మంచి కాలక్షేపం చేయడం జరుగు తుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆశించిన శుభవార్తలు వింటారు.
(గమనిక: ఈ రాశిఫలాలు జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న గ్రహాల సంచారం, రాశుల ఆధారంగా సాధారణ అంచనాలు మాత్రమే. ఇవి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. వీటిని నమ్మకం, వినోదం కోసం మాత్రమే పరిగణించాలి)



