AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షేర్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!

షేర్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!

Phani CH
|

Updated on: Oct 11, 2026 | 9:09 AM

Share

జెరోధాలో కేవలం 28 రోజుల వయసున్న పసికందు పేరిట మైనర్‌ పెట్టుబడి ఖాతా తెరిచినట్లు సంస్థ సీఈఓ నితిన్‌ కామత్‌ వెల్లడించారు. ఖాతా తెరిచిన వారం రోజుల్లోనే తొలి పెట్టుబడి కూడా చేసినట్లు తెలిపారు. గతంలో 64 రోజుల శిశువు పేరిట ఖాతా తెరిచిన విషయాన్ని పంచుకున్న ఆయన, ఈసారి మరింత చిన్న వయసున్న కస్టమర్‌ గురించి చెప్పడంతో ఈ అంశం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

షేర్ మార్కెట్ పెట్టుబడులు కేవలం పెద్దలకే పరిమితం అనుకుంటే పొరపాటే! మారుతున్న కాలానికి అనుగుణంగా తల్లిదండ్రులు తమ పిల్లల ఆర్థిక భవిష్యత్తు కోసం పుట్టిన కొన్ని రోజుల్లోనే పెట్టుబడులు ప్రారంభించేస్తున్నారు. తాజాగా ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ‘జెరోధా’లో కేవలం 28 రోజుల వయసున్న పసికందు ఖాతా తెరచి అతి పిన్న వయస్కుడైన ఇన్వెస్టర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఆసక్తికర విషయాన్ని జెరోధా సీఈఓ నితిన్ కామత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “మా కంపెనీలో అతి చిన్న వయసు కస్టమర్ వయసు కేవలం 28 రోజులు. ఆ పసికందు తల్లిదండ్రులు మైనర్ అకౌంట్ ఓపెన్ చేసి, వారం రోజుల్లోనే మొదటి ఇన్వెస్ట్‌మెంట్ కూడా పూర్తి చేశారు” అని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా ఏడాది క్రితం 64 రోజుల శిశువు పేరిట ఖాతా తెరిచి నితిన్ కామత్ పోస్ట్ చేయగా, ఇప్పుడు ఆ రికార్డు సగానికి పడిపోవడం విశేషం. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి లక్షలాది మంది వీక్షించారు. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందించారు. “కేవలం 28 రోజుల పాపాయికి ఆధార్, పాన్ కార్డులు ఎంత వేగంగా వచ్చాయి?” అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు సరదాగా కామెంట్లు చేశారు. “ఆ పసికందు ఇప్పటికే 27 రోజుల కాంపౌండింగ్ అవకాశాన్ని కోల్పోయింది” అని ఒకరు, “ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే అకౌంట్ తెరవొచ్చా?” అని మరొకరు చమత్కరించారు. మొత్తానికి పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో పెరిగిన అవగాహనకు ఈ ఘటన అద్దం పడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షాకింగ్‌ న్యూస్‌.. రైస్‌ ధరలు పెరుగుతున్నాయ్‌!

హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

అంతరిక్షంలోకి విస్కీ.. 2028లో జరగబోయే ప్రయోగం ఇదే..!

Ba Ba Black Sheep: నవ్వుల వేట.. క్రైమ్ ట్విస్ట్! బా బా బ్లాక్ షీప్ రివ్యూ

ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్‌.. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయ్‌!

Follow Us