AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతరిక్షంలోకి విస్కీ.. 2028లో జరగబోయే ప్రయోగం ఇదే..!

అంతరిక్షంలోకి విస్కీ.. 2028లో జరగబోయే ప్రయోగం ఇదే..!

Phani CH
|

Updated on: Oct 11, 2026 | 9:03 AM

Share

అంతరిక్షంలోని జీరో గ్రావిటీ వాతావరణంలో విస్కీ రుచి, సువాసన, రసాయన మార్పులను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు ‘స్పేస్‌ పఫిన్‌’ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు సమాచారం. స్కాట్లాండ్‌, జపాన్‌ ఇంజినీర్లు రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టును 2028లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చిన్న ఉపగ్రహంలోని ప్రత్యేక కంటెయినర్లలో విస్కీ నమూనాలు, ఓక్‌ చెక్క ముక్కలను ఉంచి పరిశీలించనున్నారు. అయితే అంతరిక్షంలో విస్కీ ఏజింగ్‌ వేగంగా జరుగుతుందా అనేది ప్రయోగం తర్వాతే స్పష్టమవుతుంది.

సాధారణంగా విస్కీకి మంచి రుచి, సువాసన రావాలంటే దాన్ని ఓక్ చెక్కతో చేసిన పీపాల్లో ఏళ్ల తరబడి నిల్వ చేస్తారు. అయితే, గురుత్వాకర్షణ శక్తే లేని జీరో గ్రావిటీ వాతావరణంలో విస్కీని నిల్వ చేస్తే దాని రుచి, రసాయన నిర్మాణం ఎలా మారుతుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. స్కాట్లాండ్, జపాన్ దేశాలకు చెందిన ప్రముఖ ఇంజినీర్లు కలిసి ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ‘స్పేస్ పఫిన్’ అని నామకరణం చేసిన ఈ ప్రత్యేక ప్రయోగాన్ని 2028లో నింగిలోకి పంపాలని నిర్ణయించారు. పెద్ద ఓక్ పీపాలు బరువుగా ఉండటం వల్ల, వాటికి బదులుగా చిన్న క్యూబ్‌సాట్ ఉపగ్రహంలో ప్రత్యేక మైక్రో కంటెయినర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో విస్కీ నమూనాలను ఓక్ చెక్క ముక్కలతో కలిపి అంతరిక్షంలోకి పంపిస్తారు. 2028లో స్పేస్‌ఎక్స్ మిషన్ ద్వారా ఈ విస్కీ నమూనాలను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి, అక్కడి జపాన్ మాడ్యూల్ నుంచి కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అంతరిక్షంలోని శూన్యంలో ద్రవాల కదలిక, ఉష్ణ మార్పిడి, రసాయన చర్యలను శాస్త్రవేత్తలు సెన్సర్ల ద్వారా నిశితంగా పరిశీలిస్తారు. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఓక్ చెక్క భిన్నంగా స్పందించి విస్కీ ఏజింగ్ ప్రక్రియ భూమి కంటే చాలా వేగంగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే విస్కీ తయారీలో సరికొత్త రసాయన మార్పులు వెలుగులోకి వస్తాయి. రాబోయే మూడేళ్ల నుంచి ఐదేళ్లలో అంతరిక్షంలోనే దాదాపు ఒక లీటరు విస్కీని తయారు చేసి, తిరిగి భూమిపైకి తీసుకురావాలనే ఆలోచనలో పరిశోధకులు ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ba Ba Black Sheep: నవ్వుల వేట.. క్రైమ్ ట్విస్ట్! బా బా బ్లాక్ షీప్ రివ్యూ

ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్‌.. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయ్‌!

మీ ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌ ఉన్నాయా.. మీ కరెంట్‌ బిల్లు పేలిపోద్ది జాగ్రత్త!

Yash: యశ్‌కు OTT సంస్థ బిగ్ పంచ్‌.. హిట్టు అవ్వకుంటే.. పైకం పడిపోయినట్టే!

Trivikram: తడబడుతున్న త్రివిక్రమ్‌ను చూసి టెన్షన్ పడుతున్న NTR ఫ్యాన్స్‌

Follow Us