AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram: తడబడుతున్న త్రివిక్రమ్‌ను చూసి టెన్షన్ పడుతున్న NTR ఫ్యాన్స్‌

Trivikram: తడబడుతున్న త్రివిక్రమ్‌ను చూసి టెన్షన్ పడుతున్న NTR ఫ్యాన్స్‌

Phani CH
|

Updated on: Oct 11, 2026 | 8:42 AM

Share

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాల ప్రణాళిక, షూటింగ్‌ ఆలస్యాలపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘గుంటూరు కారం’ సమయంలో జరిగిన మార్పులను గుర్తుచేస్తూ, ‘ఆదర్శ కుటుంబం’ విషయంలోనూ వాయిదాలు, రీషూట్లపై వస్తున్న వార్తలతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌, పౌరాణిక నేపథ్యంతో రూపొందాల్సిన ఎన్టీఆర్‌ ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ ప్రాజెక్ట్‌ను త్రివిక్రమ్‌ ఎలా తెరకెక్కిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆందోళనలకు సంబంధించి అధికారిక నిర్ధారణ అవసరం.

త్రివిక్రమ్ అంటే ఒకప్పుడు పక్కా ప్లానింగ్, టైంకి సినిమాను పూర్తి చేసే డైరెక్టర్‌గా పేరుండేది. కానీ ఇటీవల ఆయన ట్రాక్ రికార్డ్ అభిమానులకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ షూటింగ్ సమయంలో స్క్రిప్ట్ మార్పులు, రీషూట్లు ఏ స్థాయిలో జరిగాయో అందరూ చూశారు.ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడ్డాక సినిమా వాయిదా పడటం, మళ్లీ రీషూట్లు, మార్పులు చేర్పులంటూ కాలయాపన చేస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక సాధారణ కమర్షియల్ లేదా ఫ్యామిలీ సినిమాకే ఇంతగా తడబడుతున్న త్రివిక్రమ్, భారీ విజువల్ ఎఫెక్ట్స్, మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌తో అత్యంత సంక్లిష్టంగా తెరకెక్కాల్సిన ‘గాడ్ ఆఫ్ వార్’ను ఎలా హ్యాండిల్ చేస్తారన్నదే ప్రధాన ప్రశ్న. ఇలాంటి భారీ బడ్జెట్ ప్రాజెక్టులకు మైక్రో లెవల్ ప్లానింగ్, పక్కా ప్రీ-ప్రొడక్షన్, రాజీలేని ఎగ్జిక్యూషన్ అత్యంత కీలకం. ఒకవేళ ఇక్కడ కూడా పాత పద్ధతిలోనే రీషూట్లు, స్క్రిప్ట్ మార్పులతో కాలయాపన చేస్తే.. కోట్ల రూపాయల బడ్జెట్ వృథా కావడమే కాకుండా, ఎన్టీఆర్ కెరీర్ గోల్డెన్ టైమ్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ వాపోతున్నారు.వరుస ప్రాజెక్టులతో త్రివిక్రమ్ చూపిస్తున్న పూర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ లోపాలు చూసి తారక్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే టెన్షన్ పడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?

Follow Us