AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్‌.. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయ్‌!

ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్‌.. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయ్‌!

Phani CH
|

Updated on: Oct 11, 2026 | 8:59 AM

Share

రెపో రేటులో మార్పులు గృహ రుణాలు, కార్‌ లోన్లు, వ్యక్తిగత రుణాలపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుతో రుణాలు తీసుకున్నవారు ఈఎంఐ లేదా రుణ కాలపరిమితిలో మార్పులను ఎదుర్కొనే అవకాశం ఉంది. మరోవైపు, బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచితే ఎఫ్‌డీ ఖాతాదారులకు ప్రయోజనం కలగవచ్చు. అయితే తాజా రెపో రేటు నిర్ణయం, దాని అమలు వివరాలను ఆర్‌బీఐ అధికారిక ప్రకటనతో నిర్ధారించుకోవాలి.

సామాన్య మధ్యతరగతి ప్రజలకు, రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోలుకోలేని షాక్ ఇచ్చింది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు 5.25 శాతంగా ఉన్న రెపో రేటు ఒక్కసారిగా 5.50 శాతానికి చేరుకుంది. ఈ నిర్ణయంతో బ్యాంకులు ఇచ్చే హోమ్ లోన్లు, కార్ లోన్లు, పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ అస్థిరతలు, ఎల్ నినో ప్రభావంతో దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రకటన రాగానే దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 170 పాయింట్లకు పైగా నష్టాల్లోకి జారుకోగా, రూపాయి మారకపు విలువ 10 పైసలు క్షీణించింది. ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై గృహ రుణాలు తీసుకున్న వారిపై ఈ నిర్ణయం తక్షణ ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, రూ.50 లక్షల హోమ్ లోన్‌ను 20 ఏళ్ల కాలపరిమితికి తీసుకున్న వారిపై నెలకు దాదాపు రూ.780 వరకు అదనపు ఈఎంఐ భారం పడనుంది. కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేయనున్నాయి. పాత రుణగ్రహీతలకు ఈఎంఐ పెంచడం లేదా లోన్ కాలపరిమితిని పొడిగించడం లాంటి మార్గాలను బ్యాంకులు చూపనున్నాయి. రెపో రేటుతో ముడిపడి ఉన్న ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ ఆధారిత రుణాలు ప్రతీ మూడు నెలలకోసారి రీసెట్ అవుతాయి కాబట్టి, వీటిపై ప్రభావం వేగంగా పడనుంది. ఈ నిర్ణయం వల్ల సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి లాభం చేకూరనుంది. బ్యాంకులు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్నందున ఎఫ్‌డీలపై అధిక రాబడి లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఆర్బీఐ దశలవారీగా వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌ ఉన్నాయా.. మీ కరెంట్‌ బిల్లు పేలిపోద్ది జాగ్రత్త!

Yash: యశ్‌కు OTT సంస్థ బిగ్ పంచ్‌.. హిట్టు అవ్వకుంటే.. పైకం పడిపోయినట్టే!

Trivikram: తడబడుతున్న త్రివిక్రమ్‌ను చూసి టెన్షన్ పడుతున్న NTR ఫ్యాన్స్‌

SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?

Published on: Oct 11, 2026 08:58 AM
Follow Us