AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash: యశ్‌కు OTT సంస్థ బిగ్ పంచ్‌.. హిట్టు అవ్వకుంటే.. పైకం పడిపోయినట్టే!

Yash: యశ్‌కు OTT సంస్థ బిగ్ పంచ్‌.. హిట్టు అవ్వకుంటే.. పైకం పడిపోయినట్టే!

Phani CH
|

Updated on: Oct 11, 2026 | 8:45 AM

Share

యష్‌ నటించిన ‘టాక్సిక్‌’ సినిమా ఓటీటీ డీల్‌పై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. జీ5 డిజిటల్‌ హక్కులను దక్కించుకున్నట్లు వార్తలు వస్తుండగా, తొలుత రూ.200 కోట్లుగా వినిపించిన ఒప్పందం విలువ రూ.30 కోట్లకు తగ్గినట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ మొత్తాలపై చిత్రబృందం లేదా జీ5 అధికారికంగా స్పందించలేదు. సినిమా బాక్సాఫీస్‌ ఫలితం, ఓటీటీ బిజినెస్‌పై వస్తున్న వార్తలతో యష్‌ అభిమానుల్లో చర్చ మొదలైంది.

కన్నడ రాకింగ్ స్టార్ యష్‌కు ‘కేజీఎఫ్’ సిరీస్ ఎలాంటి గుర్తింపును తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలతో దేశవ్యాప్తంగా భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్న ఆయన.. తదుపరి చిత్రాల విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో కలిసి ‘టాక్సిక్’ అనే భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ హక్కుల విషయంలో భారీ మొత్తంలో బిజినెస్ జరగనుందనే ప్రచారం జరిగినప్పటికీ.. ఇప్పుడా డీల్.. టాక్సిక్ డిజాస్టర్‌తో భారీగా తగ్గినట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 టాక్సిక్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. తొలుత ఈ ఒప్పందం విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని ప్రచారం జరిగింది. అయితే తాజా ప్రచారం ప్రకారం, సినిమా హక్కుల కోసం మొదట అనుకున్న స్థాయిలో డిమాండ్ లేదని తెలుస్తోంది. రూ.200 కోట్లుగా వినిపించిన ఓటీటీ డీల్ విలువ రూ.30 కోట్లకు తగ్గినట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్రబృందం లేదా సంబంధిత ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు. ‘కేజీఎఫ్’ సినిమాల తర్వాత యష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నారు. చివరకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ చిత్రాన్ని చేశారు. విభిన్నమైన కథాంశం, భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trivikram: తడబడుతున్న త్రివిక్రమ్‌ను చూసి టెన్షన్ పడుతున్న NTR ఫ్యాన్స్‌

SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?

Follow Us