AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

Phani CH
|

Updated on: Oct 11, 2026 | 9:05 AM

Share

జపాన్‌లో నిద్ర ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు టోక్యోలో వినూత్న నిద్ర పోటీ నిర్వహించినట్లు కథనం చెబుతోంది. ‘మ్యాట్‌ రేస్‌’ పేరుతో జరిగిన ఈ పోటీలో పాల్గొన్నవారు 90 నిమిషాల పాటు నిద్రపోగా, నిద్ర నాణ్యతను ప్రత్యేక పరికరాలతో పరిశీలించారు. ‘సుయిమీ’ అనే మహిళ విజేతగా నిలిచి రెండు మిలియన్‌ యెన్ల బహుమతి గెలుచుకున్నట్లు సమాచారం. జపాన్‌లో పని ఒత్తిడి, నిద్రలేమిపై ఈ కార్యక్రమం దృష్టిని ఆకర్షించింది.

రాత్రింబవళ్లు పనిలో నిమగ్నమై తీవ్ర అలసటతో కూరుకుపోయే జపనీయుల కోసం టోక్యోలో ఒక వింతైన, వినూత్న పోటీ నిర్వహించారు. అదేంటంటే.. ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోవడమే! ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి ఏకంగా రెండు మిలియన్ యెన్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 12 లక్షలు పైగా నగదు బహుమతిగా ప్రకటించడంతో అందరి దృష్టి ఈ ప్రయోగంపై పడింది. టోక్యోలోని ‘కోలా స్లీప్ జపాన్’ అనే పరుపుల తయారీ సంస్థ ‘మ్యాట్ రేస్’ పేరుతో ఈ వినూత్న పోటీని నిర్వహించింది. నిద్రపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ పోటీలో తమను తాము ‘కాంపిటేటివ్ స్లీపర్స్’గా చెప్పుకునే డజన్ల మంది పాల్గొన్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన తక్కువ వెలుతురు ఉన్న గదిలో, సౌకర్యవంతమైన పరుపులపై పోటీదారులు 90 నిమిషాల పాటు నిద్రపోయారు. ఎంత వేగంగా నిద్రలోకి జారుకున్నారు, ఎంత గాఢంగా నిద్రపోయారు అనే విషయాలను కొలవడానికి పాల్గొన్నవారి తలలకు స్లీప్ ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. ఈ పోటీలో ‘సుయిమీ’ అనే మహిళ విజేతగా నిలిచి రూ. 12 లక్షల బహుమతిని సొంతం చేసుకున్నారు. బహుమతిగా వచ్చిన డబ్బుతో వేరుగా ఇల్లు తీసుకుని, యువరాణి బెడ్‌లాంటిది కొనుక్కుంటానని ఆమె ఆనందంతో చెప్పారు. జపాన్ ప్రజలు అత్యధిక పని గంటలు, ప్రయాణాల వల్ల నిద్రలేమితో బాధపడుతున్నారని ఓఈసీడీ డేటా చెబుతోంది. జపనీయులు రోజుకు సగటున కేవలం 7 గంటల 24 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నారని, నిద్ర ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతరిక్షంలోకి విస్కీ.. 2028లో జరగబోయే ప్రయోగం ఇదే..!

Ba Ba Black Sheep: నవ్వుల వేట.. క్రైమ్ ట్విస్ట్! బా బా బ్లాక్ షీప్ రివ్యూ

ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్‌.. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయ్‌!

మీ ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌ ఉన్నాయా.. మీ కరెంట్‌ బిల్లు పేలిపోద్ది జాగ్రత్త!

Yash: యశ్‌కు OTT సంస్థ బిగ్ పంచ్‌.. హిట్టు అవ్వకుంటే.. పైకం పడిపోయినట్టే!

Follow Us