షాకింగ్ న్యూస్.. రైస్ ధరలు పెరుగుతున్నాయ్!
తెలంగాణలో వర్షపాత లోటు వరి సాగుపై ప్రభావం చూపుతోంది. సాధారణ వర్షపాతం 740 మి.మీ. కాగా, ఈ ఏడాది 615 మి.మీ. మాత్రమే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో వరి సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. మరోవైపు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య సన్న బియ్యం ధరలు 13.32 శాతం పెరిగినట్లు సమాచారం. సాగు, ఉత్పత్తి తగ్గితే బియ్యం ధరలపై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమవుతున్న వర్షపాతం లోటు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణంగా కురవాల్సిన 740 మి.మీ. వర్షపాతానికి గాను ఈ ఏడాది కేవలం 615 మి.మీ. మాత్రమే నమోదైంది. ఈ 17 శాతం వర్షపాత లోటు కారణంగా రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా పడిపోయింది. గత ఏడాది 92.17 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి అది 78.23 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో తక్కువ వర్షాల వల్ల పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. అయితే సెప్టెంబర్ చివరి వారంలో కురిసిన వర్షాలు ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల్లోని పంటలకు కాస్త ఊరటనిచ్చాయి. వరికి నీటి అవసరం ఎక్కువగా ఉండటంతో, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అపరాలు, నూనెగింజలు, చిరుధాన్యాల వంటి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వాతావరణ విభాగం ప్రిన్సిపల్ సైంటిస్ట్ మహదేవప్ప రైతులకు సూచించారు. వరి సాగు విస్తీర్ణం, దిగుబడులు తగ్గనుండటంతో రాబోయే రోజుల్లో బియ్యం ఉత్పత్తి తగ్గి ధరలు మరింత మండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలోనే తెలంగాణలో సన్న బియ్యం ధరలు 13.32 శాతం పెరిగాయి. ఇది దేశంలోనే రెండో అత్యధిక పెంపు కావడం గమనార్హం. భవిష్యత్తులో బియ్యం కొరత వస్తుందనే భయంతో వినియోగదారులు ముందస్తుగా నిల్వ చేసుకోవడం కూడా సన్న బియ్యానికి డిమాండ్ మరియు ధరలు పెరగడానికి కారణమవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
అంతరిక్షంలోకి విస్కీ.. 2028లో జరగబోయే ప్రయోగం ఇదే..!
Ba Ba Black Sheep: నవ్వుల వేట.. క్రైమ్ ట్విస్ట్! బా బా బ్లాక్ షీప్ రివ్యూ
ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్.. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయ్!
మీ ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉన్నాయా.. మీ కరెంట్ బిల్లు పేలిపోద్ది జాగ్రత్త!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..

