AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాక్లెట్ చూపించి ట్రాప్.. పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే.. సంచలన నిజాలు..

సికింద్రాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూరు విల్లా ఆర్కిడ్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఆరేళ్ల చిన్నారి అరులియా మోజెస్‌ కిడ్నాప్‌, హత్య ఘటన కలకలం రేపింది. అపార్ట్‌మెంట్‌ మాజీ సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి తండ్రికి ఫోన్‌ చేసి రూ.20 లక్షలు డిమాండ్‌ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.. ఆ తర్వాత క్లబ్‌హౌస్‌ సెల్లార్‌లో చిన్నారి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు.

చాక్లెట్ చూపించి ట్రాప్.. పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే.. సంచలన నిజాలు..
Secunderabad Girl Murder Case
Shaik Madar Saheb
|

Updated on: Oct 11, 2026 | 1:09 PM

Share

నాన్న గుక్కపట్టి ఏడుస్తున్నాడు.. నిన్న మొన్నటి వరకు చేసిన ఆ అల్లరి ఇప్పుడు మూగబోయింది.. తన గారాల పట్టి ఇక లేడన్న బాధ దిగమింగుకోవడం నాన్నవల్ల కావడం లేదు .. నాకే ఎందుకు ఇలా జరిగిందని కన్నీరు పెడుతున్నాడు .. అరులియా మోజెస్‌ ఎక్కడున్నావమ్మా అంటూ తల్లీదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. కానీ.. ఆమె పలకడం లేదు.. ఈ దంపతులు పడుతున్న బాధ చూస్తే.. మనకు కూడా కన్నీళ్లు రాక తప్పదు.. సికింద్రాబాద్ బొల్లారం పరిధిలోని కౌకూరు విల్లా ఆర్కిడ్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఆరేళ్ల చిన్నారి అరులియా మోజెస్ కిడ్నాప్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.. అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ గార్డు విక్రమ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు బిహారీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

వాచ్‌మెన్‌ విక్రమ్ ను తొలగించిన అసోసియేషన్.. కక్షతో..

అయితే.. వాచ్‌మెన్‌ విక్రమ్ ను వారం క్రితం అపార్ట్‌మెంట్ అసోసియేషన్ తొలగించింది. ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. కక్షతోచిన్నారిని కిడ్నాప్ చేసేందుకు విక్రమ్ స్కెచ్ వేశాడు.. చిన్నారితో సహా మిగతా చిన్నారులకు చాక్లెట్ ఆశ చూపాడు.. క్లబ్ హౌస్‌లో మిగతా చిన్నారులు ఆడుకుంటుండగా చిన్నారిను సెల్లార్ వైపు తీసుకువెళ్లాడు.. అనంతరం చిన్నారిని హత్య చేసిన తర్వాత రెండు గంటలు క్లబ్ హౌస్ ముందే ఉన్నాడు.. క్లబ్‌హౌస్ పరిసరాల్లో చిన్నారి కోసం తాత వెతకగా.. కనిపించలేదు.. ఈ క్రమంలోనే చిన్నారిని విక్రమ్ బయటకు తీసుకెళ్లలేకపోయాడు..

పాపను కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్‌ తండ్రికి ఫోన్ చేసి 20 లక్షలు అడిగాడు.. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగడంతో దొరికిపోతానేమో అని వణికిపోయిన నిందితుడు.. పాపను చంపి సంప్ నీటిలో పడేశాడు ఎంతటి దుర్మార్గం అంటే డెడ్‌బాడీ కనిపించకుండా బండరాయి కట్టాడు. ఆపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకున్నాడు.. నిందితుడి సెల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో నిందితుడు విక్రమ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు.

కాగా.. అపార్ట్‌మెంట్ లో అరులియా మోజెస్‌ ను విక్రమ్ తీసుకెళ్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.. కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు క్లబ్‌హౌస్ సెల్లార్‌లో చిన్నారి మృతదేహం లభ్యమైంది.. ఆరేళ్ల చిన్నారి అరులియా మోజెస్ అదృశ్యం ఇలా విషాదంతంగా మారడంతో అపార్ట్‌మెంట్ వాసులు కన్నీరుమున్నీరుగా విలపనిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా
మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా
మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?