AP Local Body Elections LIVE Updates: ప్రారంభమైన ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్..
AP Local Body Polls 2026 Live Updates in Telugu: ఏపీలో మున్నిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్దం అయింది. మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

LIVE NEWS & UPDATES
-
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
సా.5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీల్లో ఎన్నికలు118 కార్పొరేటర్లు, 756 కౌన్సిలర్లు ఏకగ్రీవ ఎన్నిక92 చోట్ల పోలింగ్, 11,705 పోలింగ్ కేంద్రాలుమొత్తం 99,36,014 మంది ఓటర్లుమున్సిపల్ ఎన్నికలకు 36,351 మంది పోలీసులతో భద్రత4,372 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బందోబస్తు671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా1,233 సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసుల మోహరింపుడ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర పోలీస్ నిఘాఎన్నికల పర్యవేక్షణకు 1,543 రూట్ మొబైల్ బృందాలు111 స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర 4,655 మంది పోలీసులుఈ నెల 2న అవసరమైన చోట్ల రీపోలింగ్ఈ నెల 3న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు -
కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్
- ఉదయం .7 నుంచి సా.5 గంటల వరకు పోలింగ్
-
13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు
-
118 కార్పొరేటర్లు, 756 కౌన్సిలర్లు ఏకగ్రీవ ఎన్నిక
-
92 చోట్ల పోలింగ్, 11,705 పోలింగ్ కేంద్రాలు
-
మొత్తం 99,36,014 మంది ఓటర్లు
-
మున్సిపల్ ఎన్నికలకు 36,351 మంది పోలీసులతో భద్రత
-
4,372 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బందోబస్తు
-
671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
-
1,233 సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసుల మోహరింపు
-
డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర పోలీస్ నిఘా
-
ఎన్నికల పర్యవేక్షణకు 1,543 రూట్ మొబైల్ బృందాలు
-
111 స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర 4,655 మంది పోలీసులు
-
ఈ నెల 2న అవసరమైన చోట రీపోలింగ్
-
ఈ నెల 3న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
-
ఏపీలో మున్నిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్దం అయింది. మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే 118 కార్పొరేటర్లు, 756 కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. ఈ రోజులు 92 చోట్ల పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కోసం మొత్తం 11 వేల 705 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఈ ఎన్నికల్లో మొత్తం 99 లక్షల 36 వేల 14 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోన్నారు.
ఇక ఎన్నికల విధుల్లో భాగంగా 36 వేల 351 మంది పోలీసు భద్రత చర్యల్లో పాల్గొననున్నారు. 4 వేల 372 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బందోబస్తు పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.
1,233 సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసుల మోహరించారు. ఈ కేంద్రాలపై డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు పోలీసులు. ఎన్నికల పర్యవేక్షణ కోసం మొత్తం 1,543 రూట్ మొబైల్ బృందాలు రంగంలోకి దించారు అధికారులు. అలాగే పోలింగ్ ముగిసన తర్వాత ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 111 స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర 4 వేల 655 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈనెల 2న అవసరమైన చోట రీపోలింగ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఈనెల 3న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published On - Nov 01,2026 6:38 AM




