AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg samosa: ఉల్లి సమోసా కంటే మించిన రుచితో ఎగ్ సమోసా

సాయంత్రం వేళ వర్షం పడుతున్నప్పుడు లేదా వేడివేడిగా ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలనిపించినప్పుడు సమోసా కంటే ఉత్తమమైనది మరొకటి ఉండదు. అయితే బేకరీలు, రోడ్‌సైడ్ బండ్లపై దొరికే ఉల్లి సమోసాల కంటే ఇంట్లోనే స్వచ్ఛంగా, కోడిగుడ్లతో చేసే 'ఎగ్ సమోసా' ఎంతో రుచిగా, పౌష్టికంగా ఉంటుంది. బయట దొరికే సమోసా పట్టీలతో పనిలేకుండా.. ఇంట్లోనే కేవలం 10 నిమిషాల్లో పల్చటి సమోసా షీట్లు చేసి, ఘాటైన గుడ్డు మసాలా మిశ్రమంతో సమోసాలను చాలా తేలికగా ఒత్తుకోవచ్చు.

Phani CH
|

Updated on: Oct 31, 2026 | 8:05 PM

Share
కావలసిన పదార్థాలు: సమోసా షీట్లు, బైండింగ్ కోసం: మైదా పిండి – 1½ కప్పులు (పిండికి) + 2 టేబుల్ స్పూన్లు (పేస్ట్ కోసం), సరిపడా ఉప్పు, 3 టీస్పూన్ల వంట నూనె, పిండి కలపడానికి & మైదా పేస్ట్ కోసం తగినన్ని నీళ్లు, డీప్ ఫ్రైకి సరిపడా – వంట నూనె. స్పైసీ ఎగ్ స్టఫ్ఫింగ్ కోసం: 4 ఉడికించిన కోడిగుడ్లు, సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ తరుగు, అర టీస్పూన్ తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్,  2 పచ్చిమిరపకాయలు సన్నని తరుగు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అర టీస్పూన్ చాట్ మసాలా, అర టీస్పూన్ గరం మసాలా పొడి, అర టీస్పూన్ కారం పొడి, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ నిమ్మరసం, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, 3 టీస్పూన్ల వంట నూనె

1 / 6
తయారీ విధానం: మిక్సింగ్ బౌల్‌లో ఒకటిన్నర కప్పుల మైదా పిండి, సరిపడా ఉప్పు, 2 టీస్పూన్ల నూనె వేసి చేత్తో బాగా కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్‌గా ముద్దలా కలపాలి. పైనుంచి మరో టీస్పూన్ నూనె రాసి మూతపెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. 4 ఉడికించిన గుడ్లను నిలువుగా సగానికి కట్ చేసుకోవాలి. పాన్‌లో 2 టీస్పూన్ల నూనె వేసి పావు టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ కారం, చిటికెడు పసుపు, పావు టీస్పూన్ గరం మసాలా వేసి కలపాలి. ఇందులో గుడ్డు ముక్కలను పెట్టి మీడియం మంటపై రెండు వైపులా ఎర్రగా క్రిస్పీగా వేయించి ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన గుడ్లను చాకుతో చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2 / 6
అదే పాన్‌లో అర టీస్పూన్ నూనె, అర టీస్పూన్ జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు 50% మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన గుడ్డు ముక్కలు, అర టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అర టీస్పూన్ చాట్ మసాలా, పావు టీస్పూన్ గరం మసాలా, కొత్తిమీర, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

3 / 6
నానిన పిండిని మళ్లీ 2 నిమిషాలు ఒత్తుకుని నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకోవాలి. పొడి పిండి చల్లుతూ చపాతీ కర్రతో చాలా పల్చగా ట్రాన్స్‌పరెంట్‌గా ఒత్తుకోవాలి. పెనం వేడిచేసి.. ఒత్తిన చపాతీని వేసి ఒక్కో వైపు కేవలం 5 నుండి 10 సెకన్లు మాత్రమే వేడిచేసి తీసేయాలి. రంగు మారకూడదు. ఈ చపాతీలను నాలుగు వైపులా అంచులు కట్ చేసి సరిచేసి.. సుమారు 3 అంగుళాల వెడల్పు, 9 అంగుళాల పొడవు ఉండేలా సమోసా పట్టీలుగా కట్ చేసి తడి గుడ్డ కింద ఉంచాలి.

4 / 6
చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల మైదా, కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పేస్ట్‌లా కలపాలి. సమోసా పట్టీ ఒక చివరను త్రికోణంగా మడిచి కోన్ (Cone) ఆకారంలో చేసుకోవాలి. ఇందులో ఒకటిన్నర చెంచాల ఎగ్ స్టఫ్ఫింగ్ నింపి.. అంచుల వెంట మైదా పేస్ట్ రాసి గట్టిగా అదిమి లాక్ చేయాలి. నూనె లోపలికి వెళ్లకుండా అంచులు పూర్తిగా మూసుకోవాలి.

5 / 6
కడాయిలో నూనె పోసి మీడియం వేడిచేయాలి. పొగలు వచ్చేలా ఉండకూడదు. సమోసాలను నూనెలో వేసి మీడియం మంటపైనే నిదానంగా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా మారే వరకు వేయించి టిష్యూ పేపర్‌పైకి తీసుకోవాలి. చివర్లో కొన్ని పచ్చిమిరపకాయలను నూనెలో వేయించి సమోసాలతో పాటు సర్వ్ చేయాలి. అంతే, నోరూరించే సూపర్ క్రిస్పీ 'ఎగ్ సమోసా' సిద్ధం! టమాటా సాస్ లేదా వేయించిన పచ్చిమిర్చితో నంజుకుని తింటుంటే ప్రతి బైట్‌లోనూ గుడ్డు మసాలా ఘాటుతో హోటల్ సమోసాల కంటే అద్భుతమైన రుచినిస్తుంది!

6 / 6
Follow Us