AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారికి RBI కొత్త రూల్స్.. మొబైల్ నెంబర్ మార్చితే ఆగాల్సిందే.. కఠిన నిబంధనలు..

సైబర్ నేరాలు పెరిగిపోతున్న క్రమంలో ఆర్బీఐ ఆన్‌లైన్ పేమెంట్స్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పలు సేవలకు కూలింగ్ పీరియడ్ విధించింది. డిజిటల్ పేమెంట్స్ నిర్వహించే సంస్థలకు కొత్త రూల్స్ జారీ చేసింది. ఈ మేరకు పలు నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.

ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారికి RBI కొత్త రూల్స్.. మొబైల్ నెంబర్ మార్చితే ఆగాల్సిందే.. కఠిన నిబంధనలు..
Online Payments
Venkatrao Lella
|

Updated on: Nov 18, 2026 | 11:51 AM

Share

బ్యాంక్ సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్డుకట్ట వేసే చర్యలు చేపడుతోంది. సైబర్ నేరాల బారిన బ్యాంక్ ఖాతాదారులు పడకుండా రక్షించేందుకు కఠిన నిబంధనలు ప్రవేశపెడుతోంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతుండటంతో.. సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకోవడం కూడా ఎక్కువగా జరుగుతోంది. దీంతో సైబర్ దాడుల నుంచి ప్రజలను రక్షించేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు నాన్ బ్యాంకు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్‌కు నూతన గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఈ సైబర్ సెక్యూరిటీ రూల్స్ వల్ల ఆన్‌లైన్ పేమెంట్లకు మరింత భద్రత ఏర్పడనుంది. సైబర్ దాడి జరగ్గానే వేగంగా స్పందించడం, నిరంతరం పర్యవేక్షణ ఉండటం లాంటివి వీటిల్లో ఉన్నాయి.

12 గంటల పాటు ఆన్‌లైన్ పేమెంట్స్ బంద్

ఇక నుంచి పేమెంట్స్ సాధనానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ మార్చినప్పుడు 12 గంటల పాటు ఆన్‌లైన్ చెల్లింపులు చేయకుండా నివారించాలని ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకోసం 12 గంటల కూలింగ్ పీరియడ్ అమల్లోకి తీసుకొచ్చింది. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి ఖాతాదారుల మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ మార్చి డబ్బులు కాజేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ ఈ కొత్త నిర్ణయం తీసుకుంది.

6 గంటల్లోగా రిపోర్ట్

సైబర్ మోసాలు, ఐటీ సేవల్లో అంతరాయం, అంతర్గత మోసాలు, సెటిల్మెంట్ ప్రక్రియలో జాప్యం వంటివి జరిగినప్పుడు ఆరు గంటల్లోగా ఆర్బీఐకి నిర్ణీత ఫార్మట్‌లో రిపోర్ట్ అందించాలి. అలాగే సైబర్ భద్రతాకు సంబంధించిన ఘటనలను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు వెంటనే తెలపాలి. ప్రతీ డిజిటల్ లావాదేవీకి బహుల అంచెల ధృవీకరణ ప్రక్రియను తప్పనిసరి చేసింది. అలాగే కస్టమర్ల వ్యక్తిగత, కార్డు వివరాలు లీక్ కాకుండా ఎన్‌స్క్రిప్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించేందుకు రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి.

ఎవరెవరికి ఈ నిబంధనలు వర్తిస్తాయంటే..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వ్యవస్థను ఉపయోగించుకునే చెల్లింపు ఫ్లాట్ ఫామ్స్, పేమెంట్ అగ్రిటేటర్లు, క్రెడిట్, డెబిట్ కార్డు జారీ చేసే సంస్థలు, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అయిన గిఫ్ట్ వ్యాలెట్లు, డిజిటల్ వ్యాలెట్లు జారీ చేసే సంస్థలు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు, అధీకృత బ్యాంకింగ్ యేతర చెల్లింపు నిర్వహణ సంస్థలకు, పేమెంట్ గేట్ వే సంస్థలు, థర్డ్ పార్టీ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్లకు ఈ సైబర్ సెక్యూరిటీ రూల్స్ వర్తిస్తాయి. పెద్ద, మధ్యస్థ బ్యాంకింగ్ యేతర సంస్థలకు తక్షణమే అమల్లోకి రానుండగా.. చిన్న స్థాయి సంస్థలకు ఏప్రిల్ 1,2028 నుంచి అమల్లోకి వస్తాయి.

Follow Us