Gold Prices: పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ దిగొచ్చిన ధరలు.. ఆదివారం తులం ఎంతంటే..?
దేశంలో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా డాలర్ బలపడుతున్న క్రమంలో పసిడి ధరలు దిగొస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే బంగారం, వెండి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది ఎవరూ చెప్పలేం.

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ ఊరట కలిగింది. గోల్డ్ రేట్లు ఊహించని రీతిలో పడిపోతున్నాయి. ఒకేసారి తులం బంగారం రూ.1.40 లక్షల కంటే దిగువకు చేరుకుంది. అమెరికా డాలర్ బలపడటం, ముడి చమురు ధరలు కూడా పడిపోతున్న క్రమంలో గోల్డ్ రేట్లు కుప్పకూలుతున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింతగా పడిపోతాయనే అంచనాలు బిజినెస్ అనలిస్టుల నుంచి వినిపిస్తోంది. దీపావళి నాటికి మరింతగా దిగిరావొచ్చనే అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే పసిడి ప్రియులకు శుభవార్తగా చెప్పవచ్చు. నవంబర్ 1వ తేదీన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇవాల్టీ బంగారం ధరలు ఇవే..
-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,880 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,27,300గా ట్రేడవుతోంది.
-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,38,880గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,27,300 వద్ద ట్రేడవుతోంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,880 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,27,300గా ఉంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,39,030 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,27,450గా కొనసాగుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,38,880గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,27,300 వద్ద కొనసాగుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,880 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,27,300గా కొనసాగుతోంది.
నేడు సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే..
-చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2 లక్షలుగా ఉంది
-హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.2 లక్షల వద్ద కొనసాగుతోంది
-దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ.2 లక్షలుగా ఉంది
మార్చి తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి
బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ నుంచి కిందకు దిగొస్తున్నాయి. జనవరిలో రూ.1.80 లక్షలకు చేరుకుని రికార్డ్ సృష్టంచగా.. ఆ తర్వాత దిగజారుతున్నాయి. ఈ నెలలో మరింతగా తగ్గి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మార్చి తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి ఈ నెలలో కుప్పకూలాయి. పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించడం కంటే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఎక్కువ మొగ్గు చూపుతోంది. దీంతో పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారు. దీని వల్ల ధరలు కప్పకూలుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
