AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోదరి పెళ్లికి ఆరాటం.. నాలుగు నెలలుగా దుబాయ్ జైల్లో!

సోదరి పెళ్లికి హాజరుకావాలన్న ఓ యువకుడికి ఊహించని కష్టం ఎదురైంది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఓ ఏజెంట్‌ను నమ్మి డబ్బులు చెల్లించాడు. కానీ ఆ ఏజెంట్ మోసం చేయడంతో నాలుగు నెలలుగా దుబాయ్ జైలులో మగ్గుతున్నాడు. జార్ఖండ్‌కు చెందిన తమ కుమారుడిని విడిపించి భారత్‌కు తీసుకురావాలని తండ్రి కేంద్రాన్ని వేడుకున్నారు.

సోదరి పెళ్లికి ఆరాటం.. నాలుగు నెలలుగా దుబాయ్ జైల్లో!
Jharkhand Man Jailed In Uae After Leaving Job Without Notice
Sharada V
|

Updated on: Oct 31, 2026 | 10:00 PM

Share

సోదరి పెళ్లికి హాజరుకావాలన్న ఓ యువకుడికి ఊహించని కష్టం ఎదురైంది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఓ ఏజెంట్‌ను నమ్మి డబ్బులు చెల్లించాడు. కానీ ఆ ఏజెంట్ మోసం చేయడంతో నాలుగు నెలలుగా దుబాయ్ జైలులో మగ్గుతున్నాడు. జార్ఖండ్‌కు చెందిన తమ కుమారుడిని విడిపించి భారత్‌కు తీసుకురావాలని తండ్రి కేంద్రాన్ని వేడుకున్నారు.

సోదరి పెళ్లి కోసం స్వదేశానికి

జార్ఖండ్‌లోని పలాము జిల్లాకు చెందిన శశి కుమార్ పాస్వాన్ (23) 2025లో దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు. జూన్ 26న అతడి సోదరి వివాహం నిశ్చయమైంది. ఆ వేడుకకు ఎలాగైనా హాజరుకావాలని భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించి ఓ ఏజెంట్‌ను సంప్రదించాడు. స్వదేశానికి పంపిస్తానని నమ్మించిన ఏజెంట్‌కు డబ్బులు చెల్లించినా అక్కడే సమస్య మొదలైంది.

యజమానికి సమాచారం ఇవ్వకుండానే 7 రోజులు గైర్హాజరు

తన ఉద్యోగానికి సంబంధించి కంపెనీకి సరైన సమాచారం ఇవ్వకుండానే శశి విధులకు గైర్హాజరయ్యాడు. వరుసగా ఏడు రోజులు పనికి రాకపోవడంతో కంపెనీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. శశి గత నాలుగు నెలలుగా దుబాయ్‌లోని అల్ రషీదియా జైలులో ఉన్నాడు. జైలు నుంచి త్వరలోనే బయటకు వస్తానని కుమారుడు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఇన్నాళ్లూ ఎదురుచూశారు. నాలుగు నెలలు గడిచినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. దాద్రా గ్రామంలో నివసిస్తున్న తండ్రి లాలన్ పాస్వాన్ హుస్సినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు అధికారులు జోక్యం చేసుకోవాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వానికి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

తన భర్తను ఏజెంట్ మోసం చేసి ఇబ్బందుల్లోకి నెట్టాడని శశి భార్య సుమిత్ర ఆరోపించింది. దుబాయ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న తన భర్త నాలుగు నెలలుగా జైలులో ఉన్నాడనీ, అవసరమైన న్యాయ సహాయం అందించి, వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని అధికారులకి విజ్ఞప్తి చేసింది. శశి తండ్రి ఇచ్చిన దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపినట్లు పలాము జిల్లా ఎస్పీ కపిల్ చౌదరి తెలిపారు. కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Follow Us