ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో వర్షాలు కురవాలని కోరుతూ అర్చకులు వినూత్నంగా వరుణ జపం నిర్వహించారు. సమీపంలోని పెన్నా నది ఎండిపోవడంతో ఆలయ ప్రాంగణంలో పెద్ద గంగాళాలను నీటితో నింపి, వాటిలో మెడ వరకు మునిగి వేదపండితులు ప్రార్థనలు చేశారు. వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట కలగాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఈ ప్రత్యేక పూజలు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరువులు, నదులు చుక్క నీరు లేకుండా ఎండిపోతుండటంతో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ అనంతపురం జిల్లాలో అర్చకులు నిర్వహించిన వరుణ జపం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల కేంద్రంలోని శ్రీ అశ్వత్థ నారాయణస్వామి క్షేత్రం మరియు శ్రీ చక్ర భీమలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణంగా నదులు, చెరువులు లేదా పుష్కరిణుల్లో దిగి అర్చకులు జపం చేస్తుంటారు. కానీ, సమీపంలోని పెన్నా నది పూర్తిగా ఎండిపోవడంతో అర్చకులు వినూత్నంగా ఆలోచించారు. ఆలయ ప్రాంగణంలోనే పెద్ద పెద్ద గంగాళాలు, భారీ పాత్రలను ఉంచి, వాటిని నీటితో నింపారు. అనంతరం అర్చకులు ఆ గంగాళాల్లో మెడ వరకు నీటిలో మునిగి కూర్చుని అత్యంత నిష్టతో వరుణ జపాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం, చైర్మన్ శివశంకర్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేదపండితులు ప్రార్థనలు జరిపారు. ప్రకృతి కరుణించి, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో ఊరూ వాడా సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. గంగాళాల్లో కూర్చుని అర్చకులు చేసిన ఈ వినూత్న వరుణ జపం తాడిపత్రి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
షాకింగ్ న్యూస్.. రైస్ ధరలు పెరుగుతున్నాయ్!
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్

