AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కిరాయి కోసమని వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఆటో డ్రైవర్.. ఏం జరిగిందో తెలిస్తే..

ఒక ఆటో డ్రైవర్ అదృశ్యమై, చివరకు అటవీ ప్రాంతంలో శవమై కనిపించిన ఘటన సిద్దిపేట జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. కిరాయికి వెళ్లిన వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి, ఆధారాలు లభించకుండా ఉండేందుకు అతడి ఆటోను కూడా దహనం చేసిన ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Telangana: కిరాయి కోసమని వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఆటో డ్రైవర్.. ఏం జరిగిందో తెలిస్తే..
Siddipet Auto Driver Murder
P Shivteja
| Edited By: |

Updated on: Oct 11, 2026 | 1:30 PM

Share

కిరాయికి వెళ్లిన ఆటో డ్రైవర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణగా హత్య చేసిన ఘటన సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన మున్నూరు శ్రీనివాస్ (48) వృత్తిరీత్యా ఆటో నడుపు కుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన ఒక కిరాయి నిమిత్తం తన ఆటోతో బయటకు వెళ్లిన శ్రీనివాస్, రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు ఇరుగుపొరుగున, తెలిసిన వారి వద్ద ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు.

అయితే శనివారం నాడు జహీరాబాద్ మండలంలోని తూంకుంట శివారులో గల అటవీ ప్రాంతంలో ఒక కుళ్ళిపోయిన మృతదేహం, కాలిపోయిన ఆటో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని అదృశ్యమైన మున్నూరు శ్రీనివాస్‌గా గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనివాస్‌ను నమ్మించి లేదా బలవంతంగా ఈ అటవీ ప్రాంతంలోకి తీసుకువచ్చి హత్య చేశారని, అనంతరం వారు ప్రయాణించిన ఆటోకు నిప్పు పెట్టి దహనం చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మృతదేహం లభ్యమయ్యే సమయానికి పూర్తిగా కుళ్ళిపోయి, పాడైపోవడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేకపోయింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనా స్థలంలోనే వైద్యులతో పోస్టుమార్టం పరీక్షలను నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య మహాదేవి ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు చిరాగ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. విషయం తెలిసిన వెంటనే జహీరాబాద్ పట్టణ సీఐ రాజబోయిన రవి, జహీరాబాద్ రూరల్ ఎస్ఐ రాజేందర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ అధికారులు రంగంలోకి దిగి ఘటనా స్థలంలో వేలిముద్రలు,ఇతర కీలక ఆధారాలను సేకరించారు. శ్రీనివాస్ హత్యకు పాత కక్షలు కారణమా, ఆర్థిక లావాదేవీలా లేక కిరాయి నెపంతో ఆటోను లాక్కోవడానికి జరిగిన ప్రయత్నమా అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కిరాయి కోసమని వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఆటో డ్రైవర్
కిరాయి కోసమని వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఆటో డ్రైవర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం